Krithi Shetty: చీరలో కృతిశెట్టి - అయ్య బాబోయ్, ఏంటి ఇలా మారిపోయింది?
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మంచి విజయాన్ని అందుకుంది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు షాక్ కి గురి చేస్తున్నాయి.
కృతి శెట్టి.. అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్., వైష్ణవ్ తేజ్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డెబ్యూ చిత్రంతోనే కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈమె నటించిన తొలి సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
‘ఉప్పెన’ సూపర్ డూపర్ హిట్ తర్వాత కృతి శెట్టికి ఛాన్సులు క్యూకట్టాయి. నాని హీరోగా చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా చేసిన మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు’, రామ్ పోతినేని నటించిన ‘ది వారియర్’, నితిన్ హీరోగా వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. వీటిలో ‘బంగార్రాజు’ మాత్రమే కాస్త ఫర్వాలేదు అనిపించింది. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబుతో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మొత్తంగా తెలుగులో వరుస సినిమాలు చేసినా.. అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు ఆమె అభిమానులను షాక్ కి గురి చేస్తున్నాయి. డీప్ బ్లూ నెట్ చీరలో ఉన్న కొన్ని ఫోటోలను రీసెంట్ గా అభిమానులతో పంచుకుంది. అయితే, ఈ ఫోటోల్లో అమ్మడు పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తోంది. గతంలో కాస్త యావరేజ్ లావుతో అందంగా కనిపించేది. కానీ, చీరలో చాలా సన్నగా పీలగా కనిపించింది. ముఖంలో పూర్తిగా కళను కోల్పోయినట్లు కనిపిస్తోంది. కృతి ఏంటి ఇలా మారిపోయింది? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది మాత్రం గతంతో పోల్చితే ఈ అమ్మడు ఇప్పుడే బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కమర్షియల్ హీరోయిన్ గా సత్తా చాటేందుకు కృతి తెగ ట్రై చేస్తోంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఆఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
View this post on Instagram
ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ సినిమాలో ఈ సినిమా తెరెక్కుతున్నది. అటు తమిళంలో మరో సినిమా చేస్తున్నది. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి.
Also Read : ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం