Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?
'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులు సంతోషంగా లేరు. ఆ టీజర్ చూశాక... ప్రభాస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారట.
'ఆదిపురుష్' టీజర్ విడుదలకు ముందు వరకు సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒక్క టీజర్‌తో అంచనాల మాట సంగతి దేవుడు ఎరుగు... విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రభాస్ (Prabhas) అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. ఆ సంగతి పక్కన పెడితే... సగటు సినిమా ప్రేక్షకులు సైతం టీజర్ చూసి పెదవి విరుస్తున్నారు. ఆఖరికి ప్రభాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట!
Prabhas Fires On Om Raut : ప్రస్తుతం ప్రభాస్ వీడియో ఒకటి యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యలో 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ ప్రోగ్రామ్‌కు ప్రభాస్ ఏ డ్రస్‌లో అయితే హాజరు అయ్యారో, ఆ వీడియోలో అదే డ్రస్‌లో ఉన్నారు. అందువల్ల, టీజర్ విడుదల తర్వాత వీడియో అని చాలా మంది ఫీలింగ్. అసలు, ఆ వీడియోలో ఏముంది? అనే వివరాల్లోకి వెళితే....
''ఓం... నువ్వు నా రూమ్‌కు వస్తున్నావ్'' అని ప్రభాస్ పిలిచారు. అంతే కాదు, ఆ తర్వాత 'ఓం... నువ్వు రా'' అన్నట్లు సైగలు చేశారు. వీడియోలో కనిపించలేదు కానీ... ''నేను వస్తున్నాను'' అని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ చెప్పడం వినిపించింది. సాధారణంగా ప్రభాస్ ఎప్పుడూ సౌమ్యంగా ఉంటారు. ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అటువంటిది ఓం రౌత్‌ను పిలిచేటప్పుడు కాస్త సీరియస్‌గా ఉన్నట్లు అర్థం అవుతోంది.
'ఆదిపురుష్' టీజర్ చూశాక... రూమ్‌కు పిలిపించుకుని మరీ ఓం రౌత్‌కు ప్రభాస్ క్లాస్ పీకారని గుసగుస. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ప్రభాస్ నిజంగా ఏమన్నారో తెలియదు గానీ... ఈ గాసిప్ వైరల్ అవుతోంది. అదీ సంగతి!
'ఆదిపురుష్' టీజర్ మీద వస్తున్న ట్రోల్స్, మీమ్స్‌కు అయితే లెక్క లేదు. కార్టూన్ ఛానల్స్‌లో వచ్చే ప్రోగ్రామ్స్‌లో కూడా బెటర్ గ్రాఫిక్స్ ఉంటాయని, పాన్ ఇండియా స్టార్ చేసే సినిమాకు ఇటువంటి గ్రాఫిక్స్ ఏంటని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఓం రౌత్ తమ ఆశలపై నీళ్లు చల్లారని, ఈ టీజర్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. రావణుడిగా సైఫ్ లుక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆ పాత్రకు అసలు ఫిట్ కాలేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Also Read : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్
Adipurush Release Plans : 'ఆదిపురుష్' సినిమా విడుదలైన రోజున 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్. ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియా మొత్తం మీద సుమారు 9,500 స్క్రీన్లు ఉంటే... అందులో ఆరున్నర వేల స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్‌లు. వాటిలో సుమారు ఎనిమిది వేల స్క్రీన్‌లలో 'ఆదిపురుష్' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.