News
News
X

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న 'హంట్' సినిమా టీజర్‌ను నేడు విడుదలైంది. ఇందులో అర్జున్ ప్రసాద్ పాత్రలో ఆయన నటించారు. టీజర్ స్టైలిష్‌గా, యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది.

FOLLOW US: 
 
నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న హాయ్ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie). భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.  

అర్జున్ 'ఎ' ఎవరు?
అర్జున్ 'బి' ఎవరు?
'హంట్' సినిమాలో అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారని, ఆయనది పోలీస్ ఆఫీసర్ రోల్ అని చిత్రబృందం వెల్లడించింది. అయితే... టీజర్ చూసిన తర్వాత సినిమాలో కొత్త ట్విస్ట్ ఉంటుందని అర్థమైంది.

సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ యాటిట్యూడ్, ఎక్స్‌ట్రాడిన‌రీ ఫైటింగ్ స్కిల్స్, ఎంతటి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ముందడుగు వేసే ధైర్య సాహసాలు... అర్జున్ అంటే ఐకానిక్ పోలీస్ అన్నట్లు 'హంట్' టీజర్‌లో సుధీర్ బాబును చూపించారు. అసలు ట్విస్ట్ ఏంటంటే... అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు! ఒకరు అర్జున్ 'ఎ', మరొకరు అర్జున్ 'బి'.
 
అర్జున్ 'ఎ'కి తెలిసిన మనుషులు, సంఘటనలు, వ్యక్తిగత జీవితం ఏదీ అర్జున్ 'బి'కి తెలియదు. ఇద్దరూ వేర్వేరు మనుషులు అన్నట్టు! అయితే... అర్జున్ 'ఎ'కి తెలిసిన భాషలు, నైపుణ్యాలు, పోలీస్ శిక్షణ అర్జున్ 'బి'లో ఉన్నాయి. సూటిగా, చాలా స్పష్టంగా చెప్పాలంటే... వ్యక్తిగత జీవితంలో అర్జున్ గజినీ. పోలీస్ డ్యూటీకి వచ్చేసరికి గజినీ కాదు. అయితే... అర్జున్ 'ఎ'గా ఉండటమే హీరోకి ఇష్టం. మరి, అతని కోరిక నెరవేరిందో? లేదో? సినిమాలో చూడాలి. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది.

అర్జున్ స్టార్ట్ చేసిన కేస్ ఏమిటి?
స్టైలిష్ యాక్షన్, మ్యూజిక్, విజువల్స్‌కు తోడు టీజర్‌లో డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచాయి. ''ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి'' అని శ్రీకాంత్ చెప్పే డైలాగ్ గానీ, ''తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు'' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ గానీ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. అర్జున్ స్టార్ట్ చేసిన కేస్ ఏమిటి? చనిపోయింది ఎవరు? అనే విషయాలను టీజర్‌లో రివీల్ చేయలేదు. సినిమాకు అదే కీలక అంశంగా తెలుస్తోంది. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచింది.

News Reels

చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "టీజర్‌కు ఆడియన్స్ నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభిస్తోంది. సుధీర్ బాబు లుక్, పెర్ఫార్మన్స్ బావున్నాయని చెబుతున్నారంతా! స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. షూటింగ్ కంప్లీట్ చేశాం. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.

Also Read : 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

అంతర్జాతీయ తీవ్రవాదాన్ని స్పృశిస్తూ... పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు మహేష్ తెలిపారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సులను ఫ్రాన్స్‌లో అక్కడి స్టంట్ డైరెక్టర్స్‌తో తీశామని ఆయన పేర్కొన్నారు.    

సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ సినిమాలో 'మైమ్' గోపి, 'జిల్' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, సత్య కృష్ణన్ తదితరులు  ఇతర తారాగణం. ఈ చిత్రానికి కళ : వివేక్ అన్నామలై, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Published at : 03 Oct 2022 11:07 AM (IST) Tags: Sudheer Babu Mahesh V Ananda Prasad Hunt Movie Teaser Hunt Movie Hunt Teaser Review

సంబంధిత కథనాలు

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

టాప్ స్టోరీస్

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ - ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ -  ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Bandi Sanjay: లిక్కర్ స్కామ్ కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది, డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేస్తే ఖేల్ కతం: బండి సంజయ్

Bandi Sanjay: లిక్కర్ స్కామ్ కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది, డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేస్తే ఖేల్ కతం: బండి సంజయ్

రేవ్‌ పార్టీ కల్చర్‌ భారత్‌కు ఎలా వచ్చింది, అసలు రేవ్‌ పార్టీలో ఏం జరుగుతుంది ?

రేవ్‌ పార్టీ కల్చర్‌ భారత్‌కు ఎలా వచ్చింది, అసలు రేవ్‌  పార్టీలో ఏం జరుగుతుంది ?