అన్వేషించండి

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

'ఆదిపురుష్' టీజర్ పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.

ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ఈరోజు టీజర్ ను రిలీజ్ చేశారు.  
 
టీజర్ మొత్తం యానిమేషన్ తో నింపేశారు. లీడ్ క్యారెక్టర్స్ ను కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి చూపించారు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా 'Disappointed' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. యానిమేషన్ సినిమా చేస్తున్నట్లు ముందే చెప్పాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీజర్ లో కొన్ని షాట్స్ టెంపుల్ రన్ గేమ్ లోవి అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. 
 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పెట్టుకొని ఇలాంటి యానిమేషన్ సినిమా తీస్తారా..? అంటూ మండిపడుతున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ సినిమా వీడియో గేమ్ మాదిరి ఉందంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పై ఇంకా వర్క్ చేయాలని.. దయచేసి ఇలా సినిమా రిలీజ్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి! 

సంక్రాంతి కానుకగా... వచ్చే ఏడాది జనవరి 12న (Adipurush Release Date) ప్రపంచవ్యాప్తంగా  త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'కు ముందు, 'ఆదిపురుష్' తర్వాత అనేలా... జనవరి 12న దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి.
 
ఇకపై వ‌రుస‌గా 'ఆదిపురుష్‌'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బరాబర్‌ అమన్‌కి ఇచ్చే పడేసిన త్రిగుణ్, ముకేశ్! విన్నర్ డబ్బు ఎలా ఇస్తారంటూ గొడవ!
Action Thriller OTT : మరో ఓటీటీలోకి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ranabaali Documentary Series : రణబాలి నుంచి బిగ్ సర్ప్రైజ్ - నాలుగు ఎపిసోడ్స్‌తో డాక్యుమెంటరీ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రణబాలి నుంచి బిగ్ సర్ప్రైజ్ - నాలుగు ఎపిసోడ్స్‌తో డాక్యుమెంటరీ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
The Paradise Collections : ది ప్యారడైజ్ మూడు రోజుల కలెక్షన్స్ - వీకెండ్ జోష్... రెండు రోజులతో పోలిస్తే...
ది ప్యారడైజ్ మూడు రోజుల కలెక్షన్స్ - వీకెండ్ జోష్... రెండు రోజులతో పోలిస్తే...

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Free Rice To Fishermen: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
H-1B Visa Changes: ఏడాదిలో హెచ్-1బి వీసా నిబంధనల్లో సమూల మార్పులు.. వీసా మోసాలపై క్రిమినల్ దర్యాప్తులు!
ఏడాదిలో హెచ్-1బి వీసా నిబంధనల్లో సమూల మార్పులు.. వీసా మోసాలపై క్రిమినల్ దర్యాప్తులు!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Embed widget