Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు
Varun Tej Praveen Sattaru Movie : వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్, జానర్ గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓపెన్ అయ్యారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రూపొందించిన 'ది ఘోస్ట్' ప్రచార కార్యక్రమాల్లో ప్రవీణ్ సత్తారు బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదల అయిన తర్వాత కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
అక్టోబర్ 10 నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌లో!
Regular shooting of Varun Tej and Praveen Sattaru's movie will start on October 10th : వరుణ్ తేజ్ సినిమా గురించి ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ''అక్టోబర్ 10న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. చిత్రీకరణ ఆ అంతా యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) లో ఉంటుంది. యాక్షన్ అంతా కూడా అక్కడే'' అని తెలిపారు. స్పై థ్రిల్లర్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 'ది ఘోస్ట్' కూడా స్పై థ్రిల్లర్ కాదని ప్రవీణ్ సత్తారు తెలిపారు.
భావితరాలకు మెసేజ్ ఉంటుంది!
వరుణ్ తేజ్ సినిమాలో మెసేజ్ ఉంటుందని ప్రవీణ్ సత్తారు చెప్పారు. యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ... అందులో మంచి మెసేజ్ ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు గట్టిగా తగిలే సందేశంతో సినిమా తీస్తున్నామని ఆయన బలంగా చెప్పారు.
'గరుడవేగ' సినిమాతో స్టైలిష్ యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. నాగార్జున 'ది ఘోస్ట్' కూడా యాక్షన్ సినిమాయే. వరుణ్ తేజ్ సినిమా కూడా యాక్షన్ జానర్ ఫిల్మ్.
ఇప్పటి వరకు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవల్ అన్నట్టు వరుణ్ తేజ్ సినిమా సినిమా ఉంటుందట. అక్టోబర్ 10న స్టార్ట్ అయ్యే లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చేస్తారట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, ఆయన తనయుడు బాపినీడు నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్. అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు.
Also Read : ఫిక్షన్ సినిమాకు నాన్ ఫిక్షన్‌కు పోలిక సరైనదేనా? ‘బాహుబలి’కి ‘పొన్నియన్ సెల్వన్’కు తేడాలు ఇవే!
విలన్‌గా వినయ్ రాయ్!?
వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన 'వాన'లో వినయ్ రాజ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తెలుగు కంటే తమిళంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. విశాల్ 'డిటెక్టివ్', శివ కార్తికేయన్ 'డాక్టర్' సినిమాలతో విలన్‌గా టర్న్ అయ్యారు. ఆ రెండు సినిమాల్లో ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాలు చూసి వరుణ్ తేజ్ సినిమాలో విలన్ పాత్రకు వినయ్ రాయ్ ను ప్రవీణ్ సత్తారు సంప్రదించారట.
వరుణ్ తేజ్ - ప్రవీణ్ సత్తారు సినిమాకు సినిమాటోగ్రఫీ : ముఖేష్ హ్యాండిల్, సంగీతం : మిక్కీ జే మేయర్, ఆర్ట్ : అవినాష్ కొల్ల, సమర్పణ : నాగబాబు కొణిదెల, నిర్మాతలు : బీవీఎస్ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు.
Also Read : 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?