News
News
X

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Movie Review : కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా అదే పేరుతో దర్శకుడు మణిరత్నం రూపొందించిన సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.

FOLLOW US: 

సినిమా రివ్యూ : పొన్నియిన్ సెల్వన్ 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు 
కథ : కల్కి కృష్ణమూర్తి 'పొన్నియిన్ సెల్వన్' ఆధారం  
మాటలు : తనికెళ్ళ భరణి (తెలుగులో)
పాటలు : అనంత శ్రీరామ్ (తెలుగులో)
ఛాయాగ్రహణం : రవి వర్మన్ 
సంగీతం: ఏఆర్ రెహమాన్ 
తెలుగులో విడుదల : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ('దిల్' రాజు)
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా 
దర్శకత్వం : మణిరత్నం 
విడుదల తేదీ: సెప్టెంబర్ 30, 2022

'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan) ను తమిళ ప్రేక్షకులు సినిమాగా చూడటం లేదు. యాభై ఏళ్ళ కలగా పేర్కొంటున్నారు. దర్శకుడు మణిరత్నం మాత్రమే కాదు, చోళ సామ్రాజ్య వైభవం తెరపైకి వస్తే చూసి తరించాలని కోరుకున్న కోలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి  'బాహుబలి', 'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో వస్తున్న చిత్రమని చెబుతున్నారు. మరి, ఈ సినిమా (PS1 Review) ఎలా ఉంది?

కథ (Ponniyin Selvan Story) : చోళ సామ్రాజ్యాధినేతగా, తన తర్వాత వారసుడిగా  పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) ప్రకటిస్తాడు. పట్టం కడతాడు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామంత రాజులు అందరినీ పళు వెట్టరాయర్ (శరత్ కుమార్) ఏకం చేస్తాడు. సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలని సంకల్పిస్తాడు. ఏదో జరుగుతోందని సమాచారం అందుకున్న ఆదిత్య కరికాలుడు... తన మిత్రుడు వల్లవరాయన్ వందియ దేవుడు (కార్తీ) ని పంపిస్తాడు. అతడు ఏం చేశాడు? తమకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని తెలిసిన తర్వాత సుందర చోళుడు రెండో కుమారుడు అరుళ్ మౌళి ('జయం' రవి), కుమార్తె కుందైవై (త్రిష) ఏం చేశారు? పళు వెట్టరాయర్ భార్య నందిని దేవి (ఐశ్వర్యా రాయ్ బచ్చన్) ఉన్నంత వరకూ తంజావూరు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది సినిమా. 

విశ్లేషణ (Ponniyin Selvan Telugu Movie Review) : చారిత్రాత్మక కథలు, ప్రజలకు తెలిసిన గాథలు, పుస్తకాలను తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు మండి పడతారు. తెలిసిన కథ కాబట్టి ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోయినా ప్రేక్షకులు పెదవి విరుస్తారు. మణిరత్నం మేధస్సుకు ఇవన్నీ తెలియనివి కావు. రామాయణ, మహాభారతాల స్పూర్తితో ఆయన గతంలో సినిమాలు తీశారు. 'పొన్నియిన్ సెల్వన్' అంటూ చోళ సామ్రాజ్య చరిత్రను తెరకెక్కించే సవాలును స్వీకరించారు. 

News Reels

రాజ్యాలు, యుద్ధాలు, రాజ కుటుంబంలో కుట్రలు అంటే భారతీయ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'బాహుబలి'. రాజమౌళి అండ్ కో ట్రెండ్, స్టాండర్డ్స్ సెట్ చేశారు. ఆ సినిమా చూసిన కళ్ళతో 'పొన్నియిన్ సెల్వన్' చూస్తే నచ్చుతుందా? అని ప్రశ్నిస్తే... 'చాలా కష్టం' అని చెప్పాలి. 'బాహుబలి'ని మనసులోంచి తీసేసి చూస్తే? ఈ ప్రశ్నకూ 'కష్టం' అనే చెప్పాలి. 

మణిరత్నం అంటే ఆయన అభిమానులకు కొన్ని అంచనాలు ఉంటాయి. కొంత మంది ప్రేక్షకుల నుంచి 'ఆయన సినిమాల్లో కథనం నెమ్మదిగా ఉంటుంది' అనే విమర్శ కూడా వినిపిస్తూ ఉంటుంది. 'పొన్నియిన్ సెల్వన్' విషయంలో ఇటువంటి విమర్శలు ఎక్కువ వినిపించవచ్చు. కథలో చాలా విషయం ఉంది. దాన్ని ఎటువంటి క‌న్‌ఫ్యూజ‌న్స్‌ లేకుండా స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో మణిరత్నం అండ్ కో ఫెయిల్ అయ్యారు. 

విక్రమ్ యుద్ధం చేస్తుంటే... ఎటువంటి గూస్ బంప్స్ రావు. 'జయం' రవి, కార్తీ యుద్ధ సన్నివేశాలకూ అంతే! యాక్షన్ ఏమాత్రం ఆకట్టుకోదు. 'పొన్నియిన్ సెల్వన్'లో యుద్ధ సన్నివేశాల కంటే డ్రామా ఎక్కువ ఉంది. డ్రామా కూడా ఆకట్టుకునేలా లేదు. క్యారెక్టర్ పేర్లు అర్థం చేసుకోవడానికి సమయం పట్టేలా ఉంటే... వాళ్ళ మధ్య వరసలు అర్థం చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. చరిత్ర పుస్తకం ముందు పెట్టి మనల్ని చదువమని చెప్పినట్టు ఉంటుంది తప్ప... సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఎక్కడా ఉండదు. ఎమోషన్స్ ఏవీ కనెక్ట్ కావు. రెహమాన్ పాటలు, అక్కడక్కడా నేపథ్య సంగీతంలో మెరుపులు లేకపోతే థియేట‌ర్ల‌లో కూర్చోవ‌డం  కష్టం అయ్యేది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ బావున్నాయి. వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. 

నటీనటులు ఎలా చేశారు? : కార్తీతో కంపేర్ చేస్తే... విక్రమ్, 'జయం' రవి పాత్రలు అతిథి పాత్రల తరహాలో ఉంటాయి. సినిమా  ప్రారంభంలో ఓసారి, మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడూ, మ‌ళ్లీ ప‌తాక స‌న్నివేశాల్లో విక్ర‌మ్ క‌నిపిస్తారు. జ‌యం ర‌వి క్యారెక్ట‌ర్ ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఇంట్ర‌డూస్ అవుతుంది. యుద్ధ స‌న్నివేశాల్లో వాళ్ళిద్ద‌రూ బాగా చేశారు. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో సైతం మెప్పించారు. కార్తీ క్యారెక్ట‌ర్‌లో కామెడీ షేడ్స్ ఉన్నాయి. అటు వినోదం, ఇటు వీరత్వం... సన్నివేశాలకు అనుగుణంగా ఆయన నటించారు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, జయరామ్ తదితరులు పాత్రలకు అనుగుణంగా నటించారు. ఆయా పాత్రలకు వాళ్ళు హుందాతనం తీసుకొచ్చారు తప్ప... వాళ్ళకు పెద్దగా నటించే అవకాశం రాలేదు.

కథానాయికలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి... ప్రతి ఒక్కరికీ మణిరత్నం మర్చిపోలేని క్యారెక్టర్లు ఇచ్చారు. ముఖ్యంగా త్రిషను తెరపై చూపించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కెరీర్‌లో లుక్స్ పరంగా కుందవై క్యారెక్టర్ బెస్ట్ అండ్ టాప్ అని చెప్పాలి. ఐశ్వర్యను సైతం బాగా చూపించారు. కేవలం కళ్ళతో ఆమె హావభావాలు పలికించారు. శోభిత, ఐశ్వర్య లక్ష్మి కనిపించేది కాసేపే అయినప్పటికీ... క్యారెక్టర్లకు వాళ్లిద్దరూ న్యాయం చేశారు.   

Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : రాజ్య‌కాంక్ష‌లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. రాజ్యాధికారం కోసం చేసే యుద్ధంలో వీరత్వం ఉంటుంది. 'పొన్నియిన్ సెల్వన్'లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులు ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలను, వీరత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించగల భారీ తారాగణం, సాంకేతిక బృందం ఉంది. అయితే... తన చేతిలో ఉన్న ప్రతిభను మణిరత్నం మాత్రం సరిగా వాడుకోలేదు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏదో తీసుకుంటూ వెళ్లారు తప్ప... ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సందర్భాలు తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్' థియేటర్లలో చివరి వరకు కూర్చోవాలంటే చాలా ఓపిక కావాలి. మణిహారంలో ఇదొక మచ్చగా మిగిలే అవ‌కాశాలు ఉన్నాయి. సినిమాలో మణిరత్నం మార్క్ ఎక్కడా కనిపించలేదు. పతాక సన్నివేశాల్లో రెండో భాగంపై ఆసక్తి పెంచేలా ఒక సన్నివేశం చూపించారంతే! 

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

Published at : 30 Sep 2022 12:47 PM (IST) Tags: Mani Ratnam Ponniyin Selvan ABPDesamReview Ponniyin Selvan Review PS1 Review Ponniyin Selvan Telugu Review Ponniyin Selvan Review In Telugu  PS1 Telugu Review

సంబంధిత కథనాలు

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి