Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Telangana Cm Revanth Reddy |

Welfare hostels in Telangana | హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలం నుంచి ప్రభుత్వ స్కూల్ హాస్టల్స్ లో నాణ్యతాలోపం వల్ల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. దాంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దీనిపై ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ సైతం వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్స్ లో తనిఖీలు చేపట్టి నాణ్యత పరిశీలించాలని, తప్పిదాలు జరుగుతున్నాయని తేలితే బాధ్యులపై చర్యలకు సిద్ధమైంది. సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటన సైతం చేసింది. అయితే ఆకస్మిక తనిఖీలు అని ప్రచారం చేసి, తనిఖీలకు వెళ్లడం వెనుక ఉద్దేశం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆకస్మిక తనిఖీలు అంటేనే చెప్పాపెట్టకుండా వెళ్లి పరిశీలించి నిజనిజాలు వెలికి తీయడం కదా అని, ఇలా అధికారులు ముందస్తు ప్రకటన ఇవ్వడంపై రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
హాస్టళ్లలో మంత్రులు, అధికారుల తనిఖీలు
ఈ క్రమంలో సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకులాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం నాడు వ్యక్తిగతంగా సందర్శించనున్నారు. అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు. అయితే మంత్రులు ఏ ప్రాంతంలో ఏ గురుకుల, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు వెళ్లి తనిఖీలు చేస్తారో వివరాలు ఇవ్వడం ముందస్తుగానే వారిని అప్రమత్తం చేసినట్లు అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు 200%, డైట్ చార్జీలు 40% పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్స్ పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటి హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల తనిఖీల వివరాలు :
సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలలోని ఒక సంక్షేమ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర పాఠశాల, బోనకల్ లో తనిఖీలు నిర్వహిస్తారు. మంత్రులు డి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్, దామోదర రాజనరసింహ భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC(బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ లలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని TGTWR JC (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెం, కొండా సురేఖ TGSWR JC(బాలురు), హతనూర, సంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ TGSWR JC(బాలుర), షేక్‌పేట, హైదరాబాద్, డి అనసూయ సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడం దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ RI, TWD, జూపల్లి కృష్ణారావు, TGSWR JC(బాలికలు), కొల్లాపూర్, నాగర్ కర్నూలలో తనిఖీలు నిర్వహించనున్నారని సమాచార పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

