Allu Arjun Reamand Report : రేవతి మృతికి అసలు కారణం ఇదే - అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Arjun Arrest: అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి. టిక్కెట్లు లేని అల్లు అర్జున్ అనుచరులు వచ్చి టిక్కెట్లు ఉన్న వారిని తోసేశారు. అక్కడే తొక్కిసలాట జరిగింది.
Sensational things in Allu Arjun remand report: అల్లు అర్జున్ ను అపిషియల్ గా అరెస్టు చేశారు.రిమాండ్‌కు కూడా పంపారు. లక్కీగా హైకోర్టు గతంలో వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపి మధ్యంతర బెయిల్ ఇచ్చేయడంతో బయటకు వచ్చారు. రిమాండ్ కు వెళ్లారు కాబట్టి రిమాండ్ రిపోర్టు ఉంటుంది.అందులో సంచలన విషయాలు ఉన్నాయి. అసలు తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ వల్లేనని పోలీసులు పరోక్షంగా నిర్ధారించారు.
అర్జున్ వస్తున్నారని తెలిసినా టిక్కెట్లు అమ్మేసిన యాజమాన్యం
అల్లు అర్జున్ తో పాటు సినిమా టీం ప్రీమియర్ చూసేందుకు వస్తున్నారని యాజమాన్యానికి తెలుసు. అయినప్పటికీ ఆ షో టిక్కెట్లను ఒక్కో టిక్కెట్ వెయ్యి నుంచి పన్నెండు వందలకు అమ్మేసింది. మరి అల్లు అర్జున్ తో పాటు వచ్చే సినిమా సభ్యులు, ఆయన అభిమానులు ఎక్కడ కూర్చుని సినిమా చూస్తారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తొక్కిసలాట జరిగింది.
టిక్కెట్లు కొనుక్కుని కూర్చున్న వారిని లాగి పడేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
అల్లు అర్జున్ ధియేటర్లోకి పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులతో వచ్చారు. వారు రావడం రావడం.. సీట్లలో కూర్చున్న వారిని లాగి పడేశారు. డబ్బులు పెట్టిని కొనుక్కుని సీట్లలో కూర్చున్నవారిని అల్లు అర్జున్ తో పాటు వచ్చిన వారు లాగిపడేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ధియేటర్‌లోకి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో సామాన్య ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. రేవతి, ఆమె కుమారుడు కాళ్ల కిందనే ఉండిపోయారు. వాళ్లు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
అల్లు అర్జున్ రాక కోసం అనుమతి ఇవ్వని పోలీసులు
ధియేటర్ కు హీరో వస్తాడని పోలీసులకుస సమాచారం ఇచ్చామని ధియేటర్ యాజమాన్యం చెబుతోంది కానీ.. రిమాండ్ రిపోర్టులో అసలు పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని.. పోలీసులు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. రిమాండ్ లో ఉన్న ప్రకారం చూస్తే.. ధియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసినప్పటికీ ఫ్యాన్స్‌కు టిక్కెట్లు అమ్మారు. పెద్ద ఎత్తున జనం లోపలికి వచ్చినా అందర్నీ లాగి పడేసేచాన్స్ ఉన్నా పట్టించుకోలేదు. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తేల్చారు.
అయితే రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలను కోర్టులో వాదించడంలో ప్రభుత్వం తరపు లాయర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. రేవతి మృతికి కారణం అయిన వారు ఎవరుఅన్నది గట్టిగా వాదించలేకపోయారు. తెలంగాణ అల్లు అర్జున్ తో పాటు వచ్చిన వారు టిక్కెట్లు ఉన్న వారిని తోసేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని గట్టిగా వాదించడంలో విపలం కావడంతో .. వారు అల్లు అర్జున్ కు ముందస్తు బెయిల్ వచ్చిందని అనుకోవచ్చని అంటున్నారు. ఈ రిమాండ్ రిపోర్టు సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత మధ్యంతర బెయిల్ పై అర్జున్ విడుదలయ్యారు.