అన్వేషించండి

2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!

Yearender 2024: ఈ ఏడాది ఆట పరంగా ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా మధురంగా కొంతమంది క్రికెటర్లకు నిలిచిపోయింది. చాలామంది క్రికెటర్లు తమ వారసులకు స్వాగతం పలికారు. 

Happy Yearend To Cricketers 2024: ఈ ఏడాది కొంతమంది క్రికెటర్లకు మధురంగా మరిచిపోలేని సంవత్సరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటతోనే కాదు తమ వ్యక్తిగత జీవితంలోకి ఆనందాన్ని తెచ్చిన సంవత్సరంగా ఈ ఏడాదిని కొంతమంది క్రికెటర్లు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఈ ఏడాది చాలామంది క్రికెటర్లు తండ్రులుగా మారారు. వీరిలో కొంతమంది తొలిసారి తండ్రి అవగా, మరికొంతమంది రెండో బిడ్డకు డాడీ అయ్యారు. మరి అలాంటి వారి వివరాలు తెలుసుకుందామా..

విరాట్ కోహ్లీ.. 
ఈ ఏడాది ఫిబ్రవరి 15న తాము మరోసారి తల్లిదండ్రులుగా మారుతున్నామని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. 2021లో అప్పటికే వామిక అనే ఆడపిల్ల ఉండగా, ఫిబ్రవరిలో మగబిడ్డకు ఈ జంట జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరు ఆకాయ్ అని తెలిపారు. 
ఇక ఈ ఏడాదే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. నవంబర్ 15న తన భార్యకు మగబిడ్డ జన్మనిచ్చిందని తెలిపాడు. తన కొడుకు పేరు అహాన్ అని రోహిత్ సోషల్ మీడియాలో తెలిపాడు. అంతకుముందే 2018లో వీరికి ఒక కూతురు ఉంది. 
ఇక ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా ఈ ఏడాది మరోసారి తండ్రయ్యాడు. నవంబర్ 4న తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని, అతని పేరు జార్జి హారీసన్ హెడ్ అనితెలిపాడు. అంతకుముందే అతని భార్య 2022లో మిల్లా పెయిగ్ హెడ్ కు జన్మనిచ్చింది. 
ఇక పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది తొలిసారి తండ్రిగా ఈ ఏడాదే అయ్యాడు. షాహిన్ భార్య అన్షా ఆఫ్రిది ఆగస్టు 24న బాబుకు జన్మనిచ్చింది. తన కొడుకు పేరు ఆలియార్ ఆఫ్రిది అని సోషల్ మీడియాలో ఆఫ్రిది తెలిపాడు. 
భారత టెస్టు బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ ఏడాది తొలిసారి తండ్రయ్యాడు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన సర్పరాజ్.. ఆ సిరీస్ లో సెంచరీ చేసి సత్తాచాటాడు. ఆ క్రమంలోనే తన భార్య మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఏడాది మధురమైనదని పేర్కొన్నాడు. 

Also Read: Syed Mushtaq Ali Trophy final: ముంబై X మధ్యప్రదేశ్- సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్ ఖరారు.. బ్యాటింగ్ పవర్ తో సెమీస్ లో విజయం 

ముస్తాఫిజుర్ కూడా..
బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ ఏడాది తొలిసారి తండ్రిగా మారాడు. ఈ డిసెంబర్‌లోనే తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ 29 ఏళ్ల పేసర్ తెలిపాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ కూడా ఈ ఏడాది వ్యక్తిగతంగా శుభవార్తను విన్నాడు. తన భార్య గ్రేటా.. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, తను తొలిసారి తండ్రినయ్యానని సోషల్ మీడియాలో తెలిపాడు. కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మూడోసారి తండ్రయ్యాడు. తన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. ఇప్పటికే కేన్ మామ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అభిమానులకు శుభవార్తలు చెప్పారు. ప్రస్తుతం ఈ క్రికెటర్ల భార్యలు గర్భంతో ఉన్నారు.  2025లో వీరూ కూడా తండ్రులుగా మారనున్నారు. 

Also Read: Gukesh Chess Champion: గుకేశ్ గెలుపుపై రష్య ఫెడరేషన్ అక్కసు, దర్యాప్తు చేయాలని వింత కోరిక- ఫ్యాన్స్ మండిపాటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Embed widget