అన్వేషించండి

Baahubali - Ponniyan Selvan: ఫిక్షన్ సినిమాకు నాన్ ఫిక్షన్‌కు పోలిక సరైనదేనా? ‘బాహుబలి’కి ‘పొన్నియన్‌ సెల్వన్’కు తేడాలు ఇవే!

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'పొన్నియన్ సెల్వన్'. కొంతమంది ఈ సినిమాని బాహుబలితో పోల్చి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్..

పొన్నియన్ సెల్వన్...ఇప్పుడు ఈ సినిమా గురించే సౌత్ లో చర్చ అంతా. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తమిళనాడులో ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా...తెలుగులో మాత్రం ఈ సినిమా రిజల్ట్ పై ప్రేక్షకులు రెండుగా చీలిపోయారు. మొదటి వర్గం బాహుబలితో కంపేర్ చేస్తూ పొన్నియన్ పై పెదవి విరుస్తుంటే...రెండోవర్గం పక్కగా చారిత్రక ఆధారాలతో పుస్తకాన్ని యథాతథంగా తెరకెక్కించిన మణిరత్నాన్ని అభినందిస్తున్నారు. ఒకసారి ఈ సినిమాకు ప్రధానంగా వినిపిస్తున్న నెగటివ్స్ వాటికి జస్టిఫికేషన్ పాయింట్స్ ఏంటో ఓ సారి చూద్దాం. 

1. బాహుబలి స్థాయిలో లేని పొన్నియన్ సెల్వన్ 

ఓ ఫిక్షన్ సినిమాను తీయటంలో డైరెక్టర్ కు పరిమితులు ఉండవు. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయటం కోసమో, ఎమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లటం కోసం ఫిక్షన్ లో డైరెక్టర్ ఎన్ని మార్పులు చేర్పులైనా చేసుకోవచ్చు. రాజమౌళికి బాహుబలి విషయంలో ఉన్న ఫ్రీ హ్యాండ్ అదే. అయితే అమరేంద్ర బాహుబలిని లేదా మహేంద్ర బాహుబలినో, అంతెందుకు కట్టప్ప, భళ్లాల దేవుడు, శివగామి, దేవసేన ఇలా ఏ క్యారెక్టర్ విషయంలో అయినా రాజమౌళి పెంచి చూపించొచ్చు.. అంటే గ్లోరిఫై చేయొచ్చు లేదా ఫ్లోలో కొట్టుకుంటూ తీసుకెళ్లొచ్చు. కానీ మణిరత్నం కు పొన్నియన్ విషయంలో ఈ ఫ్రీడం ఉండదు. చోళుల చరిత్ర తమిళనాడు అస్థిత్వం. నిజంగా జరిగిన కథలను మార్చటం సమంజసం కూడా కాదు. పైగా కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్ ' పుస్తకాల ఆధారంగానే  ఈ సినిమాను తీస్తున్నట్లు మణిరత్నం ముందే ప్రకటించారు. కాబట్టి.. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి స్కోప్ ఉండకపోవచ్చు. అందుకే బుకిష్ స్టోరీలా ఉండి బాహుబలి  రేంజ్ లో అటెన్షన్ డ్రా చేయలేకపోయింది పొన్నియన్ సెల్వన్.

2. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేకింగ్ 

రాజమౌళి సినిమా టేకింగ్ వేరు. మణిరత్నం టేకింగ్ వేరు. రాజమౌళికి ఆడియెన్స్ ఎమోషన్ తెలుసు. ఎక్కడ ఎలాంటి సీన్ పెడితే ఆడియెన్స్ కు గూస్ బంప్స్ వస్తాయో..ఆ పల్స్ తెలిసిన వ్యక్తి. పైగా వీఎఫ్ఎక్స్  కి రాజమౌళి సినిమాల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అవుట్ డోర్స్ కంటే గ్రీన్ మ్యాట్ కి జక్కన్న కాంపౌండ్ లో ఇంపార్టెన్స్ ఎక్కువ. బట్ మణిరత్నం రాజమౌళికి పూర్తి విరుద్ధం. మణిరత్నం నుంచి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఆయన సినిమాలన్నీ స్లో పేస్ లో ఉండటానికి కారణం మణిరత్నం టేకింగ్. క్యారెక్టర్ ను గ్లోరిఫై చేసి ఆడియెన్స్ లో హై ఆక్టేన్ ఫ్లో తెప్పించటం కంటే.. క్యారెక్టర్ డీటైలింగ్ ఇవ్వటంలో...యాక్టర్ల ఎక్స్ ప్రెషన్స్  వాళ్ల యాక్టింగ్ ఎబిలిటీస్ పై నే ఎక్కువగా డిపెండ్ అవుతారు.  గీతాంజలి, నాయకుడు, దళపతి, ముంబయి, రోజా, అమృత.. ఏ సినిమా అయినా తీసుకుంటే ఆ సినిమాలో క్యారెక్టర్ లు ఇప్పటికీ గుర్తుంటాయంటే ఆ పాత్రలను ప్రేక్షకులతో అంత బలంగా ముడివేస్తాడు మణిరత్నం. వీఎఫ్ఎక్స్ ల కంటే నేచురల్ లొకేషన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. యాక్టర్లకు ఎంత ఇబ్బందిగా ఉందని అనిపించినా.. లొకేషన్స్ నేచురల్ గా ఉంటేనే ఆ సీన్ ఎలివేట్ అవుతుందని మణిరత్నం నమ్ముతారు.

3. ప్లాట్ కి సెంట్రిక్ క్యారెక్టర్ లేకపోవటం 

ఇప్పుడు బాహుబలి అంటే ఎవరి కథ అని చెబుతారు. అఫ్ కోర్స్ బాహుబలి కథ. కానీ పొన్నియన్ సెల్వన్ కి అలాంటి క్యారెక్టర్ లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న పాయింట్. ఆదిత్య కరికాలుడిగా చేసిన విక్రమ్, పొన్నియన్ సెల్వన్ గా చేసిన జయం రవి కంటే వల్లవరాయ వందియదేవుడిగా చేసిన కార్తికి ఎక్కువ స్కోప్ ఉంది సినిమాలో. మరి సినిమాకు సెంట్రల్ క్యారెక్టర్ అతనేనా అనుకుందాం అంటే.. ఫిమేల్ క్యారెక్టర్స్ చాలా బలంగా కనిపించాయి ఈ సినిమాలో అనేది అందరూ కామన్ గా ఒప్పుకుంటున్న పాయింట్. త్రిష పోషించిన కుందవై, ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని క్యారెక్టర్లు సినిమాను చాలా వరకూ నడిపించాయి. ఒరిజినల్ పొన్నియన్ సెల్వన్ కథలో కూడా ఇదే తరహా స్క్రీన్ ప్లే ఉంది. మణిరత్నం దాన్ని అలాగే అడాప్ట్ చేసుకున్నారు. కథ తగ్గట్లు పాత్రలు వచ్చి వెళ్లటం తప్ప..పాత్రలు నడిపే కథ కాదు అది. 

సో ఇవి ప్రధానంగా పొన్నియన్ సెల్వన్, బాహుబలికి వస్తున్న కంపారిజన్స్ . ఏది ఏమైనా మణిరత్నం.. మణిరత్నమే. రాజమౌళి రాజమౌళినే. ఇద్దరినీ కలిపి చూడటం కంటే.. పొన్నియన్ లో మణి ఏం చెప్పాడనే దానిపై కాన్సట్రేషన్ పెట్టడం, వీలైతే బుక్ చదివి సినిమా చూడటం ద్వారా మరింతగా ఆ క్రాఫ్ట్ ను అర్థం చేసుకోగలరు అనేది పొన్నియన్ సెల్వన్ బుక్  చదివిన వాళ్లు చెబుతున్న మాట.

Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Embed widget