Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్
'గాడ్ ఫాదర్' గురించి ఒకరు చేసిన కామెంట్, ట్విట్టర్ రివ్యూ మెగా అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది. అతడు సినిమా ఫ్లాప్ అంటుంటే హ్యాపీ ఫీలవుతున్నారు.
'గాడ్ ఫాదర్' (Godfather)గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డీటీఎస్‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఫైనల్ మిక్సింగ్ అన్నీ పూర్తి చేసి ఫైనల్ కాపీని సోమవారం ఉదయం హ్యాండ్ ఓవర్ చేశానని దర్శకుడు మోహన్ రాజా తెలిపారు. బుధవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదీ నెగిటివ్ రివ్యూ! అది చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? ఏమిటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
Godfather First Review : ''కొత్త సీసాలో పోసిన పాత సారాలా ఉంది 'గాడ్ ఫాదర్'. బి అండ్ సి సెంటర్ ప్రేక్షకులకు, క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌కు ఏవరేజ్ సినిమా. చిరంజీవి... దయచేసి విశ్రాంతి తీసుకోండి. నేను 2.5 రేటింగ్ ఇస్తున్నాను'' అని ఉమైర్ సందు ట్వీట్ చేశారు.
ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. అందులో ''చిరంజీవికి సాలిడ్ స్క్రిప్ట్స్ అవసరం. మాస్ రోల్స్ నుంచి బయట పడాలి. స్టుపిడ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుని టైమ్ వేస్ట్ చేసుకోకండి. మీరు మెగాస్టార్. అయితే, కథల ఎంపికలో సెన్స్ లేదు. 'గాడ్ ఫాదర్' ఏవరేజ్ సినిమా'' అని పేర్కొన్నారు.
హ్యాపీగా మెగా ఫ్యాన్స్!
'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అని ఉమైర్ సందు ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ''నువ్వు ఇలా అన్నావ్ అంటే సినిమా బ్లాక్ బస్టర్'' అని అతడికి ఒకరు రిప్లై ఇచ్చారు. ''హమ్మయ్య. ఎక్కడ ఎప్పటిలా బ్లాక్ బస్టర్ అంటావో అని టెన్షన్ పడ్డాం'' అని ఇంకొకరు రిప్లై ఇచ్చారు. ''ఫస్ట్ టైమ్ అనుకుంట... వీడు నెగిటివ్ రివ్యూ ఇవ్వడం. సో, సినిమా పక్కా బ్లాక్ బస్టర్ ఆ'' అని మరొకరు ట్వీట్ చేశారు. అయితే... కథల ఎంపికలో చిరంజీవికి సెన్స్ లేదని చెప్పడంతో కొంత మంది మెగా ఫ్యాన్స్ అతడి మీద మండి పడుతున్నారు. చిరంజీవికి సలహాలు ఇచ్చేంత అనుభవం నీకు లేదని ఉమైర్ సందుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుహాసిని మణిరత్నం ప్రశ్న!
ఇటీవల 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకు కూడా ఉమైర్ సందు రివ్యూ, రేటింగ్ ఇచ్చారు. ''నువ్వు ఎవరు? ఇంకా విడుదల కాని సినిమా చూడటానికి మీరు ఎవరు?'' అని అతడిపై మణిరత్నం సతీమణి, ప్రముఖ నటి సుహాసిని ప్రశ్నించారు. 'గాడ్ ఫాదర్' రివ్యూ ట్వీట్ చేశాక... కొంత మంది ఆమె ట్వీట్‌ను గుర్తు చేస్తున్నారు.
Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?
ఉమైర్ సందు రివ్యూలు ఫేక్ అని... సోషల్ మీడియాలో అందరి దృష్టి తనపై పడటం కోసం, ఫేమ్ కోసం సినిమా చూడకుండా రివ్యూలు రాస్తారనే టాక్ ఉంది. సో... ఆయన రివ్యూలను మెజారిటీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అసలు పట్టించుకోవడం లేదు. అదీ సంగతి!
'గాడ్ ఫాదర్' సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరు సోదరిగా నయనతార (Nayanthara), ఆమె భర్తగా సత్యదేవ్ (Satyadev Kancharana), ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు. తమన్ సంగీతం అందించారు.
Also Read : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్