Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Telangana News: డిసెంబర్ 28న భూమి లేని నిరుపేదలకు డబ్బులు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఆసక్తిని రేపుతోంది. అర్హులను ఎలా గుర్తిస్తారనే చర్చ నడుస్తోంది.
Telangana News: తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రెండు విడతలుగా ఇచ్చే సాయం తొలి దఫా నిధులు ఆరు వేల రూపాయలను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28ని నిధుల విడుదలకు ముహూర్తంగా ఎంచుకున్నారు.
భూమి ఉన్న రైతులకు ఇప్పటికే ఏటా 12 వేల రూపాయాలను ప్రభుత్వం ఇస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీన్ని సంక్రాంతి నుంచి ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. అంత కంటే ముందు భూమి లేని రైతులకు సాయం చేయాలని భావిస్తోంది. అయితే అర్హుల ఎంపిక చేస్తారు. ఎన్ని కోట్లు ఖర్చు కానుందనే చర్చ మొదలైంది.
అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదట్లోనే ఈ పథకంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పుడు అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అర్హులను ఎలా ఎంపిక చేస్తారు. అర్హులు ఎవరు.. ఎంతమందికి ఈ నిధులు అందజేస్తారనే వివరాలు సభలో ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
తెలంగాణలో భూమి లేని పేదలను గుర్తించేందుకు ఎలాంటి సర్వే ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టలేదు. పదేళ్లుగా చాలా రకాల సర్వేలు ప్రకటించినప్పటికీ ఈ భూమి లేని నిరుపేదల విషయంలో ఎలాంటి లెక్కలు లేవని తెలుస్తోంది. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన సర్వేలు ఏవీ పూర్తిగా కొలిక్కి రాలేదు. వాటిని ఆధారంగా చేసుకునేందుకు కూడా వీలు లేదు. అందుకే రెవెన్యూ రికార్డులతోపాటు ఉపాధి హామీ పథకాన్ని ఆధారంగా చేసుకుంటుందా అనే అనుమానం ఉంది.
ఉపాధి హామీ పథం ప్రకారం రాష్ట్రంలో 53 లక్షళ కుటుంబాల వారికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉంటారు. అందులో వారిని ఎలా వేరు చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ లెక్కలతోపాటు రెవెన్యూ రికార్డులు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం 40 లక్షల కుటుంబాలను భూమి లేని వారిగా ప్రభుత్వం గుర్తించిందని అంటున్నారు.
ఈ లెక్కలు కాసేపు పక్కన పెడితే.. అసలు అర్హులను ఎలా గుర్తిస్తారు. భూమి లేని వారిని ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తారనే చర్చ కూడా ఉంది. ఎంతలా కుదించినప్పటికీ పాతిక నుంచి 30 లక్షల కుటుంబాలకు మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. అంటే దాదాపు 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సంవత్సరానికి అంటే మూడు నుంచి 3వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాలి.
రుణమాఫీ, రైతు భరోసా మాదిరిగా కాకుండా ప్రతి నిరుపేదకు న్యాయం జరిగేలా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అనవసరమైన కొర్రీలు పెట్టి ప్రజలను మోసం చేయొద్దని సూచిస్తున్నారు. లేకుంటే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ ప్రతిపాదన విరమించుకోవాలి - ఎమ్మెల్యే హరీష్ బాబు