Entertainment Top Stories Today: ‘దేవర’ రెండు రోజుల కలెక్షన్స్, మేడం టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: ‘దేవర’ రెండు రోజుల కలెక్షన్స్ నుంచి మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.
రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. ప్రభాస్‌ను జోకర్ అంటూ ప్రారంభించిన వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళ సినిమా ‘గరుడన్’ తెలుగు రీమేక్‌లో శంకర్ కుమార్తె అదితి హీరోయిన్‌గా నటించనున్నారట. ‘దేవర’ రెండు రోజుల్లో రూ.243 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆలియా భట్ ‘జిగ్రా’ తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు.
మేడం టుస్సాడ్స్‌లో రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. అతి త్వరలో ఆయన వాక్స్ స్టాట్యూ (మైనపు విగ్రహం) మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత అందుకుంటున్న తొలి టాలీవుడ్ హీరోగా రామ్ చరణ్ రేర్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. అరుదైన ఘనత అందుకోబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రెండు రోజుల్లో 200 కోట్లు దాటేసిన 'దేవర'
'దేవర'కు క్రిటిక్స్ నుంచి సూపర్ పాజిటివ్ రివ్యూస్ ఏమీ రాలేదు. ఆ రివ్యూలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు కాస్త నిరాశకు గురి చేశాయి. మొదటి రోజు బెనిఫిట్ షోస్ భారీ ఎత్తున వేయడం కూడా కొంత నెగిటివ్ టాక్ రావడానికి కారణం అయ్యిందని చెప్పాలి. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కాలేదు. అటు ఇటు కొంత వ్యతిరేకత ఉండడంతో వసూలు ఎలా ఉంటాయో అని అభిమానులు కొందరు ఆందోళన చెందారు. అయితే... బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్ తన సత్తా చాటుతున్నారు. భారీ కలెక్షన్స్ దిశగా సినిమాను తీసుకువెళ్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ
శంకర్ తమిళ దర్శకుడు కావచ్చు... కానీ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆయన తెలుసు. తెలుగులోనూ శంకర్ అంటే అభిమానం చూపించే జనాలు చాలా మంది ఉన్నారు. ఆయన ఫ్యామిలీ గురించి తెలుసా? ఆయన కుమార్తె అదితి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలుసా? అతిథి శంకర్ నటించిన రెండు తమిళ సినిమాలు ఆల్రెడీ విడుదల అయ్యాయి. మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం కావడానికి రెడీ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'జిగ్రా' తెలుగు ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
సీత కోసం అల్లూరి వచ్చారు. సీత అంటే... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్ ఆలియా భట్ పేరు. అందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా ఆమె కనిపించారు. ఈ విజయ దశమికి 'జిగ్రా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘జోకర్’ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్‌స్టాప్
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొంతకాలం క్రితం ప్రభాస్‌ను 'జోకర్' అని పిలిచినందుకు చాలా ట్రోలింగ్‌ను ఎదుర్కోవలసి వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది దక్షిణాది నటులు అర్షద్‌పై విరుచుకుపడ్డారు. దీని కారణంగా ప్రభాస్ అభిమానుల నుంచి కూడా అర్షద్ వార్సీ బోలెడంత వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. ఈ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తాను ప్రభాస్‌ను 'జోకర్' అని పిలవలేదని చెప్పాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)