Jigra Trailer Telugu: సీత కోసం అల్లూరి... 'జిగ్రా' తెలుగు ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
Ram Charan for Alia Bhatt: ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'జిగ్రా' తెలుగు భాషలోనూ విడుదల అవుతోంది. ఆ సినిమా తెలుగు ట్రైలర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
సీత కోసం అల్లూరి వచ్చారు. సీత అంటే... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) పేరు. అందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జోడీగా ఆమె కనిపించారు. ఈ విజయ దశమికి 'జిగ్రా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు.
తమ్ముడి కోసం అక్క... యాక్షన్ బాటలో ఆలియా!
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'జిగ్రా' (Jigra Movie). ఈ సినిమాలో ఆమె తమ్ముడిగా వేదాంగ్ రైనా (Vedang Raina) నటించారు. హిందీలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఎత్తున సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద మ్యాచో యాక్టర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేస్తున్నారు.
The #Jigra trailer looks absolutely amazing… taking you on an emotional rollercoaster!
— Ram Charan (@AlwaysRamCharan) September 29, 2024
Best wishes to Alia and the entire team for a blockbuster release on October 11th! ❤️🔥
Here's the Telugu trailer!https://t.co/a5AabB24uZ#JigraTelugu #KaranJohar @apoorvamehta18 @aliaa08… pic.twitter.com/oXeWCs4U7V
'జిగ్రా' కథ ఏమిటి? ఇందులో ఇంకెవరు నటించారు?
విదేశాల్లో ఓ ఇండియన్ కుర్రాడు అరెస్ట్ అవుతాడు. ఇండియాలో ఉన్న అతని అక్క తమ్ముడి కోసం ఎంత దూరం వెళ్లడానికి అయినా సిద్ధం అవుతుంది. ఒకవేళ తాను గనుక చెయ్యి కట్ చేసుకుంటే తమ్ముడిని చూసేందుకు అనుమతి ఇస్తారా? అని అడుగుతుంది. తమ్ముడిని జైలు నుంచి విడిపించడం కోసం ఏకంగా ఆ దేశం వెళ్లి అక్కడ భారీ పోరాటం చేయడానికి రెడీ అవుతుంది. మరి, ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకోవడం కోసం అక్టోబర్ 11 వరకు వెయిట్ చేయాలి.
Also Read: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!
'జిగ్రా'లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రానికి వసంత్ బాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ... ''భాషతో సంబంధం లేకుండా ఎవరికైనా కనెక్ట్ అయ్యే సినిమా 'జిగ్రా'. ఇందులో మంచి సోల్ ఉంది. ఇటువంటి వైవిధ్యమైన కథతో రూపొందిన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని... ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి నేను, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇందులో యాక్షన్ మాత్రమే కాదు... కుటుంబ అనుబంధాలు సైతం ఉన్నాయి. మనం ప్రేమించిన వ్యక్తులను ఎలా కాపాడుకోవాలో చెప్పే చిత్రమిది'' అని చెప్పారు.
రానా దగ్గుబాటి విలన్ రోల్ చేసిన 'బాహుబలి'ని హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేసింది. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన 'ఘాజీ'ని సైతం హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లింది. ఆ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్, రానా దగ్గుబాటి భాగస్వామ్యంలో 'జిగ్రా' తెలుగులో విడుదల అవుతోంది. ఆలియా భట్ ఇప్పటి వరకు చేయనటువంటి యాక్షన్ రోల్ ఈ సినిమాలో చేశారు.
Also Read: రెండో రోజూ తెలుగులో అదరగొట్టిన ఎన్టీఆర్ - తెలంగాణ, ఏపీలో 'దేవర' 2 డేస్ టోటల్ షేర్ ఎంతంటే?