Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Pushpa 2 Box Office Collection Day 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ దండయాత్ర మూడో రోజూ జోరుగా, హుషారుగా సాగింది. మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Pushpa 2 Day 3 Collection Worldwide: రికార్డుల జాతర... కేవలం తెలుగు గడ్డ మీద మాత్రమే కాదు, ఉత్తరాది థియేటర్లలోనూ రికార్డుల జాతర... బాక్స్ ఆఫీస్ బరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వసూళ్ల దండయాత్ర... ఆ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. మూడు రోజులకే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. పలు రికార్డులు క్రియేట్ చేసింది.
మూడు రోజుల్లో 621 కోట్లు... పుష్పరాజ్ మాస్!
అక్షరాల ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు... ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప 2' సినిమా మూడు రోజుల్లో వసూలు చేసిన మొత్తం 621 కోట్లు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో అమౌంట్ కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ సినిమాగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024
The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4
హిందీలో స్టార్ హీరోలకు అందని రికార్డులు...!
ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాదు... ఉత్తరాదిలోనూ 'పుష్ప 2 ది రూల్' సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే అక్కడ రూ. 200 కోట్లు వసూలు చేసి సౌత్ సినిమా సత్తా ఏమిటో చూపించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' సినిమా మూడు రోజుల్లో 180 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ రికార్డును పుష్ప రాజ్ అధిగమించాడు.
#Pushpa2TheRule is setting new benchmarks in Indian Cinema ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024
Registers the highest single day collection in Hindi with a 74 CRORES NETT on Day 3 🔥
The BIGGEST INDIAN FILM is the fastest to 200 CRORE NETT film in Hindi with a 3 day figure of 205 CRORES 💥💥… pic.twitter.com/7obnmYdDdh
వీకెండ్ అయ్యే సరికి 750 కోట్లు... మరి 1000!?
'పుష్ప 2' సినిమాను గురువారం విడుదల చేయడం ఒక విధంగా కలిసి వచ్చింది. బుధవారం రాత్రి వేసిన పెయిడ్ ప్రీమియర్ షో ల నుంచి మంచి సూపర్ డూపర్ హిట్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఆ తరువాత గురువారం ఫ్యాన్స్ అందరూ సినిమా చూశారు. తర్వాత రోజు శుక్రవారం కూడా అభిమానుల సందడి థియేటర్ల దగ్గర కనిపించింది. దాంతో శని ఆదివారాలలో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ కట్టారు.
శుక్రవారం కంటే శనివారం కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. శనివారం కంటే ఆదివారం కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయని తెలుస్తోంది. మూడు రోజుల్లో 621 కోట్లు కలెక్ట్ చేసిన 'పుష్ప 2' సినిమా.... నాలుగో రోజు 130 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దాంతో వీకెండ్ కలెక్షన్స్ 750 కోట్లు దాటుతాయని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే హిందీలో 'పుష్ప 2' సినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. కేవలం హిందీ వెర్షన్ వసూళ్లు 1000 కోట్లు దాటవచ్చు అని చెబుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?