Allu Arjun: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?
'మెగా వర్సెస్ అల్లు' ఫ్యాన్ వార్‌కు ఫుల్ స్టాప్ పడేలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పీచ్ ఇచ్చారు. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో ఆయన పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పారు.
మెగా కుటుంబానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) దూరం అవుతున్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్స్ సైతం సోషల్ మీడియాలో కొందరు చేస్తున్నారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడేలా 'పుష్ప 2: ది రూల్' బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రెస్ మీట్ (Pushpa 2 blockbuster success press meet)లో అల్లు అర్జున్ తన స్పీచ్ ఇచ్చారు. అందులో ఏపీ డిప్యూటీ సీఎంకి స్పెషల్ థాంక్స్ చెప్పారు.
థాంక్యూ కళ్యాణ్ బాబాయ్... అల్లు అర్జున్!
''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ జీవో పాస్ అయ్యి 'పుష్ప 2' చిత్రానికి స్పెషల్ టికెట్ రేట్లు రావడానికి కారణమైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా, మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. ఆన్ ఏ పర్సనల్ నోట్... కళ్యాణ్ బాబాయ్, థాంక్యూ సో మచ్'' అని అల్లు అర్జున్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఏపీ రాష్ట్ర రాజకీయాలలో అల్లు అర్జున్ లేనప్పటికీ... వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నంద్యాల శిల్పా రవి ఇంటికి వెళ్లడం మెగా అభిమానులు పలువురికి నచ్చలేదు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అదే అదునుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ క్రియేట్ చేశారు కొందరు. 'పుష్ప 2' విజయం తర్వాత బన్నీని తమ వాడిగా పేర్కొన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. శిల్పా రవి సైతం బన్నీతో దిగిన ఫోటో ట్వీట్ చేశారు. ఇవన్నీ చర్చనీయాంశం అయ్యాయి. బన్నీని రాజకీయపరంగా వాడుకోవాలని చూస్తున్నారని వినిపించాయి. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రెస్ మీట్ వేదికగా కళ్యాణ్ బాబాయ్ అని అల్లు అర్జున్ సంబోధించడంతో ఇకపై ఫ్యాన్ వార్ వంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశించవచ్చు.
Also Read: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
తెలంగాణ రాష్ట్రంలోనూ టికెట్ రేట్లు పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 'పుష్ప 2' సినిమా కోసం ప్రత్యేక జీవో విడుదల చేసిన ఆయనకు కూడా అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు థాంక్స్ చెప్పారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినిమా విజయవంతం కావడానికి కారణమైన అన్ని భాషల ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర... అఫీషియల్‌గా రెండు రోజుల్లో 'పుష్ప 2' కలెక్షన్లు ఎంతో తెలుసా?
హీరోలపై కామెంట్స్ చేసే అభిమానులకు హెచ్చరికలు
ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సైతం శుక్రవారం ఒక ట్వీట్ చేసింది. ఇతర హీరోలు రాజకీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారికి తమ మద్దతు ఉండదు అని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా అల్లు అర్జున్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. అభిమానులు ఎటువంటి వివాదాలలో ఉండకూడదని కోరుకునే వ్యక్తి. అభిమానం పేరుతో కొంతమంది చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు ముగింపు పలకాలని తన సన్నిహితుల దగ్గర తన బృందం వద్ద ఆయన సూచన చేసినట్లు ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందుకే అభిమానులు ఇచ్చే ఇంటర్వ్యూలలో ఎటువంటి కాంట్రవర్షియల్ అంశాలు ఉండకూడదు అని ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్వీట్ చేసిందని టాక్.