ఆలియా భట్ ఇప్పుడు అందమైన అమ్మాయి మాత్రమే కాదు, ఓ అమ్మాయికి తల్లి కూడా! గత ఏడాది నవంబర్ 6న పండంటి అమ్మాయికి ఆలియా భట్ జన్మ ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ దంపతులు తమ కుమార్తెకు రహా అని పేరు పెట్టారు ఇప్పుడు డిస్కషన్ ఆలియా భట్ అమ్మాయి గురించి కాదు... ఆమె లేటెస్ట్ స్టైల్ గురించి! ఆలియా భట్ కొత్త ఫోటోలు ఎవరైనా తెలియని వాళ్ళకు చూపించి... అమ్మాయికి తల్లి అంటే నమ్మడం కష్టమే. అమ్మైన తర్వాత ఆలియా భట్ అందం మరింత పెరిగినట్టు మెరిసిపోతున్నారు. ఆలియా భట్ మునుపటి శరీరాకృతికి వచ్చేశారు. మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఫిట్ అండ్ ఫ్యాబులస్ అన్నట్టు రెడీ అయ్యారు. రీసెంట్ గా ఆలియా భట్ ముంబైలో ఓ సెలూన్ కి వెళ్లారు. అక్కడ తీసిన ఫోటోలు ఇవి ఆలియా భట్ కొత్త ఫోటోలు (Image Courtesy : Manav Manglani)