అందంగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఒక్కసారి ఆలోచించండి! బెంగళూరులో సెటిలైన ఈ పంజాబీ అమ్మాయి, అంతకు ముందు గోవాలో కొన్ని రోజులు ఉన్నారు. తెలుగు సినిమాలు చేశారు. 'అశోక వనంలో అర్జున కళ్యాణం'లో హీరోయిన్ గుర్తుందా? ఫస్టాఫ్ లో పెళ్ళికి ఓకే చెప్పి తర్వాత ప్రేమించిన అబ్బాయితో వెళుతుంది. ఆ అమ్మాయే ఈ అమ్మాయి... పేరు రుక్సార్ థిల్లాన్! 'అశోక వనంలో...' లంగా ఓణీలు, చీరల్లో సంప్రదాయబద్ధంగా కనిపించారు. నిజం చెప్పాలంటే రుక్సార్ చాలా మోడ్రన్ గాళ్. ఇదిగో ఫోటో చూస్తే అర్థం కావడం లేదూ! అల్లు శిరీష్ 'ఏబీసీడీ'లో కూడా పద్ధతిగా ఉంటారు. అయితే, నాని 'కృష్ణార్జున యుద్ధం'లో జీన్స్, టీ షర్ట్ లో స్టయిలుగా కనిపించారు. ఛాన్స్ వస్తే మోడ్రన్ గాళ్ రోల్స్ చేయడానికి రెడీ అని ఫోటోషూట్స్ ద్వారా రుక్సార్ సిగ్నల్స్ పంపిస్తున్నట్టు లేదూ! 'అశోక వనంలో...' పాట ఉంది కదా! 'ఓ ఆడపిల్లా... నువ్ అర్థం కావా?' అని! అలా రుక్సార్ స్టైల్ అర్థం కాదని నెటిజన్స్ అంటున్నారు. మోడ్రన్, ట్రెడిషన్... ఎలాగైనా కనిపించడం రుక్సార్ స్టైల్! రుక్సార్ థిల్లాన్ (Image Courtesy : Rukshar Dhillon / Instagram)