హాట్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆస్ట్రేలియాలో! అవును... ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఫేమస్ సిటీస్ అన్నీ కవర్ చేస్తున్నారు సారా అలీ ఖాన్. ప్రేమికుల రోజు కంటే ముందు సారా అలీ ఖాన్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ, మెల్బోర్న్... ఇలా అక్కడి నగరాల్లో ఆమె తిరుగుతున్నారు. సారా అలీ ఖాన్ స్పెషాలిటీ ఏంటంటే... ఆవిడ ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆస్టేలియాలో సిడ్నీ బీచ్ లో బికినీ ధరిస్తే... మరొక చోట ఇలా చుడిదార్ లో సందడి చేశారు. లేటెస్టుగా పాలోజీ డ్రస్ లో సారా అలీ ఖాన్ సందడి చేశారు. సారా అలీ ఖాన్ వెంట కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. సోలో ట్రిప్ వేశారని సమాచారం. ప్రస్తుతం సారా అలీ ఖాన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నారు. అందులో షూటింగ్ కంప్లీట్ అయినవి మూడు. మరొకటి సెట్స్ మీద ఉంది. సారా అలీ ఖాన్ (Image Courtesy : Sara Ali Khan / Instagram)