బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ తెలుసా? ఈ ఫొటోల్లో ఉన్నది ఆవిడే! ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా 'దమ్ లగా కే హైసా' సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీకి భూమి ఇంట్రడ్యూస్ అయ్యారు. 'దమ్ లగా కే హైసా'లో భూమి పెడ్నేకర్ చాలా లావుగా కనిపించారు. ఆ తర్వాత సన్నబడ్డారు. భూమి పెడ్నేకర్ ను ఇప్పుడు ఎవరైనా చూస్తే... 'సీతా రామం'లో పాట ఉంది కదా! అది పాడతారేమో!? 'ఇంతందం దారి మళ్లిందా? భూమి పైకే చెరుకున్నాదా? లేకుంటే చెక్కి ఉంటారా... అచ్చు నీలా శిల్ప సంపాదన' అన్నట్టు లేదూ! భూమి పెడ్నేకర్ లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. వీటి కింద ఎక్కువ మంది ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. డిసెంబర్ 16, 2023లో విడుదలైన విక్కీ కౌశల్ 'గోవిందా నామ్ మేరా'లో భూమి వైఫ్ రోల్ చేశారు. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో భూమి పెడ్నేకర్ ఒకరు. భూమి పెడ్నేకర్ (Image Courtesy : Bhumi Pednekar Instagram)