బాలీవుడ్ హీరో హృతిక్ తన భార్య సుసానే నుంచి 2014లో విడిపోయారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ సాబా అజాద్ అనే నటితో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాబా అజాద్ కూడా బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. వర్క్ పరంగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. ధూమ్ 3లో టైటిల్ సాంగ్ పాడింది. కానీ అందులో ఆమీర్ ఖాన్ నటించారు. ఇటీవలే ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో టైటిల్ సాంగ్‌ను కూడా సాబా పాడింది. 2022లో సూపర్ హిట్ అయిన ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్‌లో కూడా సాబా నటించారు. ప్రస్తుతం సాబా చేతిలో సినిమాలేవీ లేవు. హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రభాస్‌తో కలిసి మల్టీస్టారర్ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.