'బింబిసార' విజయం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా 'అమిగోస్'. శుక్రవారం విడుదలైంది.

కథ : సిద్ధార్థ్ (కళ్యాణ్ రామ్)... తన రూపురేఖలతో ఉన్న మరో ఇద్దర్ని కలుస్తాడు. ఆ ఇద్దరు సిద్ధు ప్రేమకు సహాయం చేస్తారు.

సిద్ధార్థ్ కలిసిన ఇద్దరిలో మైఖేల్ ఒకడు. అతడొక గన్ డీలర్. ఎన్ఐఏ అతడి కోసం గాలిస్తుంది. 

మైఖేల్ తన బదులు సిద్ధూను అరెస్ట్ చేసేలా ప్లాన్ వేస్తాడు. ఎందుకు? ముగ్గురిలో ఎవరు అరెస్ట్ అయ్యారు? తర్వాత ఏమైంది? అనేది సినిమా. 

ఎలా ఉంది? : 'అమిగోస్' కాన్సెప్ట్ బావుంది. కానీ, కథను తీసిన విధానం అంతగా ఆకట్టుకోదు. 

'అమిగోస్'లో అసలు కథ ఇంటర్వెల్ ముందు గానీ స్టార్ట్ కాదు. అప్పటి వరకు ఉన్న ప్రేమకథ ఆకట్టుకోదు. 

'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' రీమిక్స్ సాంగ్ వినడానికి, చూడటానికి బావుంది. ఆర్ఆర్ జస్ట్ ఓకే. ఆషికా రంగనాథ్ బావుంది. 

సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాతలు కథకు తగ్గట్టు ఖర్చు చేశారు. కామెడీ లేదు గానీ థ్రిల్స్ కొన్ని ఉన్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ మూడు పాత్రలో చక్కగా నటించారు. వేరియేషన్స్ చూపించారు.

ముఖ్యంగా మైఖేల్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటన, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇచ్చే ఎలివేషన్స్ బావున్నాయి. 

కళ్యాణ్ రామ్ యాక్టింగ్, ఎఫర్ట్స్ ఓకే. కానీ, రెండు గంటలు ఎంగేజ్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.