బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. సూపర్ హిట్ తెలుగు సినిమా ‘అల వైకుంఠపురములో’ అధికారిక రీమేక్ ఇది. కార్తీక్ ఆర్యన్ సరసన కృతి సనన్ కనిపించనుంది. మురళీ శర్మ పాత్రలో విలక్షణ నటుడు పరేష్ రావల్ నటించారు. ట్రైలర్ చూస్తే సీన్ టు సీన్ రీమేక్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అసలు ఈ సినిమా ఫిబ్రవరి 10నే విడుదల కానుంది. కానీ పఠాన్ వేవ్ కారణంగా ఒక వారం వాయిదా వేశారు. ఫిబ్రవరి 17వ తేదీకి అయినా పఠాన్ వేవ్ తగ్గి షెహజాదాకు మంచి ఓపెనింగ్ వస్తుందేమో చూడాలి!