మంగళవారం జరిగిన సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల వివాహానికి కరణ్ జోహార్ హాజరయ్యాడు. కరణ్ జోహార్ ఈ వేడుకలో ‘కాలా చష్మా’ పాటకు డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. కరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా వారికి శుభాకాంక్షలు తెలిపాడు. బుధవారం ఉదయం ఆయన జైసల్మేర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. కరణ్ కనిపించగానే ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. గ్రే డెనిమ్ జాకెట్, టీ-షర్ట్‌తో కరణ్ కనిపించాడు. గ్రే, బ్లాక్ బ్యాగీ ప్యాంట్‌ను కరణ్ ధరించాడు. వెరైటీ సన్‌గ్లాసెస్ కూడా వేసుకున్నాడు. Image Credits: Manav Manglani