అనూ ఇమ్మాన్యుయేల్ అందానికి ఏమైంది? ఇప్పుడు తెలుగులో ఆమె అభిమానులను కలవరపెడుతున్న అంశమిది. అనూ ఇమ్మాన్యుయేల్ లేటెస్టుగా ఫోటోషూట్ చేశారు. అందులో ఆవిడ బ్లూ డ్రస్ వేసుకున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కొత్త ఫోటోలు చూస్తే... ఆవిడ వెయిట్ లాస్ అయినట్లు తెలుస్తోంది. బరువు తగ్గడంతో పాటు ముఖంలో ఛార్మ్ అనేది లాస్ అయ్యిందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కు బబ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. బబ్లీనెస్ చూసి ఇష్టపడిన ప్రేక్షకులకు వెయిట్ లాస్ కావడం నచ్చడం లేదు. నటనతో కంటే అందంతో తెలుగులో అనూ ఇమ్మాన్యుయేల్ ఎక్కువ మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. అందులో రవితేజ హీరో. తమిళంలో హీరో కార్తీ 'జపాన్' సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో రీసెంట్ గా అను హిట్ కొట్టారు. ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ (All Images Courtesy : Anu Emmanuel, Bharat Rawail Instagram)