అషు రెడ్డికి స్పెషల్ ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఆమె తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. 'బిగ్ బాస్' హౌస్ లో అషు రెడ్డి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కూడా టీవీ షోస్, సినిమాలు చేశారు. లేటెస్టుగా బ్లాక్ జంప్ సూట్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేశారు. ఇప్పుడు అషు రెడ్డి విశాఖ, అరకు టూర్ వేశారు. అక్కడ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు. అరకులో అందంగా ఫోటోలు దిగి పోస్ట్ చేస్తున్నారు. అన్నట్టు... అషు రెడ్డి పేరును ఓ అభిమాని గుండెలపై ఈ విధంగా పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తన పేరును టాటూ వేయించుకున్న ఫోటోను అషురెడ్డి ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అరకు, విశాఖలోని ఓ నాటుకోళ్ల ఫారానికి వెళ్ళిన అషురెడ్డి, అక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అషురెడ్డి కొత్త ఫోటోలు (All Images Courtesy - Ashu Reddy Instagram)