శ్రద్ధా దాస్ అంటే గ్లామర్ గాళ్ అనే ఇమేజ్ ఉంది. ఆమెను అందాల రాణిగా కొందరు చూస్తారు. 

గ్లామర్ చూపించడంతో పాటు శ్రద్ధా దాస్ కామెడీ చేస్తే? ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు కొన్నాళ్ళు ఆగితే ఆన్సర్ వస్తుంది.

తానొక కొత్త సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్టు శ్రద్దా దాస్ పేర్కొన్నారు. అందులో తనది ఫన్ క్యారెక్టర్ అని చెప్పారు. 

ఫన్ క్యారెక్టర్ అనడం మినహా శ్రద్ధా దాస్ మిగతా విషయాలు వెల్లడించలేదు. 

ప్రస్తుతానికి తాను ఇంతకు మించి ఏమీ చెప్పలేనని, త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తామని శ్రద్ధ పేర్కొన్నారు. 

ఒకవైపు సినిమాలు చేయడంతో పాటు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'కి శ్రద్ధా దాస్ జడ్జ్ గా చేస్తున్నారు. 

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన హిందీ వెబ్ సిరీస్ 'ఖాకీ : ద బీహార్ చాఫ్టర్'లో శ్రద్ధా దాస్ నటించారు. 

ప్రస్తుతం తెలుగులో శ్రద్ధా దాస్ 'నిరీక్షణ' అనే సినిమా చేస్తున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. 

శ్రద్ధా దాస్ (All Images Courtesy : Shraddha Das Instagram)