క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చుపెట్టాలి. - సముద్రఖని డబ్బులున్నవాడు ఈ లెక్కన కొంటాడు. లేనివాడు అప్పు చేసైనా కడతాడు - సముద్రఖని అటెండెన్స్ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్‌లో ఉంటాడు. చాలెంజ్ చేస్తున్నా - ధనుష్ అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఒక్కరోజే బాధపడతారు. వాళ్ల అమ్మానాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తారు - ఆడుకాలం నరేన్ ఎడ్యుకేషన్‌లో వచ్చే డబ్బు పాలిటిక్స్‌లో రాదు. - సముద్రఖని డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు. మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది. - ధనుష్ తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 17వ తేదీన ‘సార్’ విడుదల కానుంది.