మిల్కీ బ్యూటీ తమన్నా తన కొత్త సినిమాల గురించి అప్‌డేట్ ఇచ్చింది. ఈ సంవత్సరం తను నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయని తెలిపింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్‌లో నటించినట్లు తెలిపింది. అలాగే హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌కు కూడా కమిటైనట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలో త్వరలో వస్తుందట. నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో కూడా నటించినట్లు తెలిపింది. చిరంజీవికి జోడీగా ‘భోళా శంకర్’లో కనిపించనున్నట్లు పేర్కొంది. ఇక రజినీకాంత్ ‘జైలర్’ గురించి చెప్తూ, ఆయనతో నటించడం తన కల అంది.