సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కొత్త జంట కెమెరాలకు పోజిచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా పూర్తిగా బ్లాక్ డ్రస్‌ను ధరించాడు. కియారా మాత్రం బ్లాక్, వైట్ కాంబినేషన్ డ్రస్‌లో కనిపించింది. ఈ వేడుకలకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కపూర్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ ఫొటోల్లో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు. చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన అనంతరం వీరు వివాహం చేసుకున్నారు. ఈ నెలలోనే వీరి వివాహం జరిగింది.