అన్వేషించండి

U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం

Vaibhav Suryavanshi: దుబాయ్ వేదికగా జరిగిన అండర్ -19 అసియా కప్‌లో భారత్ ఓటమిపాలైంది. బౌలర్లు రాణించినా, బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. 

U19 Asia Cup Final: టోర్నీలో లీగ్, నాకౌట్ దశలో అదరగొట్టిన టీమిండియా ఫైనల్ ఫోరులో మాత్రం చతికిలపడింది. అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 59 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. నిజానికి తొలుత భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఓవర్‌కు 4 పరుగుల రిక్వైర్డ్ రన్ రేట్ అవసరమైన ఇన్నింగ్స్‌లో ఆ తరహా ఆట తీరు ప్రదర్శించ లేకపోయారు. కనీసం ఓవర్లన్నీ కూడా ఆడలేక ప్రత్యర్థికి టైటిల్ అప్పగించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి, ఇన్నింగ్స్‌లో చాలావరకు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. నిజానికి టోర్నీ ఆరంభంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలయ్యాక భారత్ పుంజుకుంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తుదిపోరుకు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆ తరహా పోరాటాన్ని కనబర్చడంతో విఫలమైంది. 

భారత బౌలర్ల  శ్రమ వృథా...

నిజానికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను భారత బౌలర్లు బాగా కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 49.1 ఓవర్లలో 198 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 35.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. 13 ఏళ్ల ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (9) విఫలమయ్యాడు. ఏడు బంతులు ఆడిన అతను కేవలం రెండు ఫోర్లు కొట్టి పెవిలియన్‌కు చేరాడు. నిజానికి బౌండరీలు బాది మంచి ఊపు మీదున్న సూర్యవంశీ.. ఇటీవల చేసిన మెరుపు సెంచరీ మాదిరి ఆట తీరును అభిమానులు ఆశించారు. అయితే అనవసర షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆయుష్ మాత్రే కూడా ఒక్క పరుగుకే వెనుదిరగడంతో తొలి 5 ఓవర్లలో 24/2తో నిలిచింది. ఆ తర్వాత పరుగులు రాకుండా బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు కట్టదిట్టంగా వ్యవహరించడంతో టీమిండియా ఒత్తిడికి లోనైంది. ఆండ్రె సిద్ధార్థ్ (35 బంతుల్లో 20) కూడా విఫలమయ్యాడు. మహ్మద్ అమన్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితో పాటు హార్దిక్ రాజ్ (24) తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే వీళ్ల పోరాటంతో భారత్ కనీసం వంద పరుగుల మార్కును దాటింది. బంగ్లా దేశ్ బౌలర్ అజిజుల్ హకీమ్ (3/8) పొదుపుగా బౌలింగ్ చేసి, కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. 

రిజాన్ హుస్సేన్ పోరాటం..

ఫైనల్ పోరులో పరుగులు చేయడానికి కష్ట సాధ్యమైన పిచ్‌పై బంగ్లా బ్యాటర్ రిజాన్ హుస్సేన్ (47) తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. అతనికి షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హుస్సేన్ (3) చక్కని సహకారం అందించాడు. దీంతో బంగ్లా గౌరవ ప్రదమైన స్కోరును చేరుకుంది. భారత బౌలర్లలో యుధజిత్ గుహ, చేతన్ శర్మ, రాజ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. కిరణ్ చోర్మాలే, కార్తికేయ, మాత్రేకు తలో వికెట్ దక్కింది. 

Also Read: Cricketers Retired in 2024​: డేవిడ్ వార్నర్ నుంచి డికాక్ వరకూ, క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event: సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event: సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
EPFO ​​ATM Card: ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Telegram New Feature: టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
టెలిగ్రామ్ యూజర్లకు కొత్త ఫీచర్ - ఇకపై థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా?
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Embed widget