అన్వేషించండి
Advertisement
Cricketers Retired in 2024: డేవిడ్ వార్నర్ నుంచి డికాక్ వరకూ, క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజాలు
Cricketers retired in 2024: 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి డేవిడ్ వార్నర్ నుంచి మ్యాథ్యూ వేడ్ వరకూ పలువురు క్రికెటర్లు రిటైర్ మెంట్ ప్రకటించారు.
International cricketers who retired in 2024:
అంతర్జాతీయ క్రికెట్ నుంచి పలువురు క్రికెటర్లు రిటైర్ మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ లో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు.. కన్నీళ్లతో మైదానాన్ని వీడారు. డేవిడ్ వార్నర్ నుంచి మ్యాథ్యూ వేడ్ వరకూ ఎందరో 2024లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ఆ విదేశీ ఆటగాళ్లు ఎవరో ఓసారి చూసొద్దాం..
డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్.. అన్ని ఫార్మట్ల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో తన చివరి టెస్ట్ సిరీస్ అని చెప్పిన వార్నర్.. ఆ సిరీస్ ముగిశాక రిటైరైపోయాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో వార్నర్
పాకిస్తాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వార్నర్ తన చివరి వన్డే 19 నవంబర్, 2023న భారత్‌పై ఆడాడు. వార్నర్ తన కెరీర్‌లో 112 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. వన్డేల్లో 161 మ్యాచ్‌లు ఆడి 6932 పరుగులు చేశాడు. వార్నర్ మొత్తం 48 సెంచరీలు చేశాడు.
క్వింటన్ డికాక్
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డి కాక్ వన్డేలకు వీడ్కోలు పలికాడు.
డీన్ ఎల్గర్
దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ కూడా తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా తరపున 86 టెస్టులు, 8 వన్డేలు ఆడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్.. భారత్‌పై చివరి మ్యాచ్ ఆడాడు.
డీన్ ఎల్గర్ 86 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 14 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు చేశాడు. 37.92 సగటుతో 5347 పరుగులు చేశాడు. ఎల్గర్ 18 టెస్ట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
హెన్రిచ్ క్లాసెన్
దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డే, టీ 20లపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు టెస్టులకు క్లాసెన్ వీడ్కోలు పలికాడు. అక్టోబరు 2019లో భారత్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్లాసెన్.. మూడు మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 108 పరుగులు చేశాడు.
నీల్ వాగ్నర్
న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ నీల్ వాగ్నర్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. వాగ్నర్ 2012 నుంచి 2024 వరకు న్యూజిలాండ్ తరపున 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 260 వికెట్లు తీశాడు. అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
కోలిన్ మున్రో
టీ 20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కకపోవడంతో న్యూజిలాండ్ ఓపెనర్ కోలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మున్రో కివీస్ తరపున 65 టీ 20 మ్యాచులు ఆడాడు.
జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మట్లకు గుడ్ బై చెప్పేశాడు. మేలో అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు మరియు అతని చివరి టెస్ట్ మ్యాచ్ జూలై 2024లో ఇంగ్లాండ్‌కి వచ్చింది. 2009లో చివరి T20 మ్యాచ్, 2015లో చివరి వన్డే ఆడిన అండర్సన్... టెస్టు కెరీర్ ను 2024లో ముగించాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రికెట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement