Arshad Warsi: ‘జోకర్’ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్‌స్టాప్ - నేను ప్రభాస్‌ని అనలేదంటూ!
Prabhas Vs Arshad Warsi: ప్రభాస్‌ను జోకర్ అంటూ అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్‌పై భారీ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అర్షద్ వార్సీ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Arshad Warsi Clarification On Calling Prabhas Joker: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొంతకాలం క్రితం ప్రభాస్‌ను 'జోకర్' అని పిలిచినందుకు చాలా ట్రోలింగ్‌ను ఎదుర్కోవలసి వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది దక్షిణాది నటులు అర్షద్‌పై విరుచుకుపడ్డారు. దీని కారణంగా ప్రభాస్ అభిమానుల నుంచి కూడా అర్షద్ వార్సీ బోలెడంత వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. ఈ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తాను ప్రభాస్‌ను 'జోకర్' అని పిలవలేదని చెప్పాడు.
ఏఎన్ఐ వార్తా సంస్థలో వచ్చిన కథనం ప్రకారం... అర్షద్ వార్సీ మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరికీ కొన్ని అంశాలపై వారిదైన అభిప్రాయం ఉంటుంది. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇష్టపడతారు. కల్కి సినిమాకు సంబంధించి నేను వ్యక్తి గురించి కాకుండా అతను పోషించిన పాత్ర గురించి మాట్లాడాను. అతను (ప్రభాస్) ఒక తెలివైన నటుడు. తనను తాను ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. దాని గురించి మనందరికీ తెలుసు. అలాంటి మంచి నటుడికి చెడ్డ క్యారెక్టర్ ఇస్తే ప్రేక్షకుల గుండె పగిలిపోతుంది.' అన్నాడు.
Also Read: రెండో రోజూ తెలుగులో అదరగొట్టిన ఎన్టీఆర్ - తెలంగాణ, ఏపీలో 'దేవర' 2 డేస్ టోటల్ షేర్ ఎంతంటే?
అర్షద్ వార్సీ... ప్రభాస్‌ను 'జోకర్' అని ఎప్పుడు అన్నాడు?
ఒక ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ... ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' గురించి మాట్లాడారు. ఆ సినిమా తనకు నచ్చలేదని, ప్రభాస్ పాత్ర ‘జోకర్’లా కనిపించిందని చెప్పాడు. అర్షద్ మాట్లాడుతూ 'కల్కిని చూశాను, నాకు నచ్చలేదు. నేను చాలా బాధపడ్డాను. ప్రభాస్ ఎందుకు ఉన్నాడు అసలు ఆ సినిమాలో. అతను ఒక 'జోకర్'లా ఉన్నాడు. నేను మ్యాడ్ మాక్స్‌ని చూడాలనుకుంటున్నాను. నేను ప్రభాస్‌ని మెల్ గిబ్సన్‌లా చూడాలనుకుంటున్నాను.’ అన్నారు.
సౌత్ నుంచి గట్టి రిప్లై
అర్షద్ వార్సీ చేసిన ఈ ప్రకటన తర్వాత చాలా మంది సౌత్ స్టార్స్ ప్రభాస్‌కు మద్దతుగా నిలిచారు. నటుడు నాని, సుధీర్ బాబు, దర్శకుడు అజయ్ భూపతి సహా పలువురు ప్రముఖులు అర్షద్‌పై ఎదురుదాడికి దిగారు. అదే సమయంలో 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అర్షద్‌కు సమాధానం ఇచ్చాడు. అతను ఇలా వ్రాశాడు- 'అర్షద్ సాహెబ్ ఈ విషయంలో వేరే పదాలను ఎంచుకుంటే బాగుండేది. అయినా పర్వాలేదు. నేను ఆయన పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపుతున్నాను. నేను ‘కల్కి 2’లో ప్రభాస్‌ని బెస్ట్‌గా చూపిస్తాను. ' అని పోస్ట్ పెట్టాడు.
Also Read: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!
It's okay to criticize constructively but it's never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas's stature is too big for comments coming from small minds..
— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024
#Prabhas is the man who has given everything & will do anything to take Indian Cinema to the world audience, a Pride of our nation.
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 19, 2024
We can see the jealousy on that film, on him in your eyes just because you've faded out & no one gives an eye to you.
There's a limit & a way to…