Entertainment Top Stories Today: ‘దేవర’కు ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ‘సరిపోదా శనివారం’ ఓటీటీ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’కు ఏపీలో టికెట్ రేట్ల పెంపు నుంచి ‘సరిపోదా శనివారం’ ఓటీటీ అప్‌డేట్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.
Entertainment News Today: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభం అయింది. నాని బ్లాక్‌బస్టర్ ‘సరిపోదా శనివారం’ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. భార్యతో విడాకులపై స్పందిస్తూ తమిళ హీరో జయం రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.
సూపర్ స్టార్ మేనల్లుడి కొత్త సినిమా ప్రారంభం
కంటెంట్ బేస్డ్ కథలకు పెద్ద పీట వేస్తూ వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఒక వైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేస్తూ... మరో వైపు యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తూ డిఫరెంట్ ఫిలిమ్స్ తీయడం మొదలు పెట్టారు సితార అధినేత సూర్యదేవర నాగవంశీ. ఆయన శనివారం కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా (Ashok Galla) కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 27ను ప్రారంభించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దేవర’ టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీన్ని బట్టి ఏపీలో ‘దేవర’ భారీ ఓపెనింగ్స్ కొట్టడం ఖాయం అన్నది ఫిక్స్ అయింది. మొదటి రోజు అంటే సెప్టెంబర్ 27వ తేదీన ‘దేవర’ స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు రాష్ట్రంలో ఉన్న థియేటర్లు అన్నిటిలో వేసుకోవచ్చన్న మాట. 28వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు రోజుకు ఐదు ఆటలకు అనుమతి వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నాలుగు వారాలకు ముందే ఓటీటీలో `సరిపోదా శనివారం`
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ `సరిపోదా శనివారం`. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను యాక్షన్ ఎంటర టైనర్ గా రూపొందించారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించారు. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే మౌత్ టాక్ తో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా చక్కటి వసూళ్లను సాధిస్తున్నది. నాని కెరీర్ లో రూ. 100 కోట్లు సాధించిన సినిమాల లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. ఇప్పటికే ‘ఈగ’, ‘దసరా’ సినిమాలు రూ. 100 కోట్లు సాధించిగా, ఇప్పుడు `సరిపోదా శనివారం` ఆ ఘనత సాధించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
డివోర్స్, బెంగళూరు సింగర్‌తో రిలేషన్ మీద ‘జయం‘ రవి షాకింగ్ కామెంట్స్
తమిళ నటుడు ‘జయం‘ రవి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే తనకు చెప్పకుండా వన్ సైడ్ గా రవి విడాకుల నిర్ణయం తీసుకున్నారని ఆయన భార్య ఆర్తి ఆరోపించగా... తాజాగా మరో కొత్త కథ తెర మీదకు వచ్చింది. ఓ సింగర్ తో ఉన్న రిలేషన్ కారణంగా ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరుకు చెందిన సింగర్ తో ఆయన కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి గోవా సహా పలు ప్రాంతాల్లో వెకేషన్ ఎంజాయ్ చేశారని ఓ తమిళ మ్యాగజైన వెల్లడించింది. ఈ ప్రచారంపై ‘జయం‘ రవి రియాక్ట్ అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
వెంకటేష్ సినిమా సెట్స్‌లో బాలకృష్ణ సందడి
విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో జరుగుతోంది. వెంకటేష్ సహా ఇతర ప్రముఖ తారాగణం పాల్గొంటున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ #వెంకీఅనిల్3 చిత్రీకరణ జారుతున్న ప్రదేశంలో సందడి చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)