అన్వేషించండి

Saripodhaa Sanivaaram OTT: నాలుగు వారాలకు ముందే ఓటీటీలో `సరిపోదా శనివారం`... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడు చూడాలంటే?

నాని హీరోగా తెరకెక్కి తాజా చిత్రం `సరిపోదా శనివారం` థియేటర్లలో సత్తా చాటింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

Saripodhaa Sanivaaram OTT Release Date: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ `సరిపోదా శనివారం`. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను యాక్షన్ ఎంటర టైనర్ గా రూపొందించారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించారు. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే మౌత్ టాక్ తో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా చక్కటి వసూళ్లను సాధిస్తున్నది. నాని కెరీర్ లో రూ. 100 కోట్లు సాధించిన సినిమాల లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. ఇప్పటికే ‘ఈగ’, ‘దరస’ సినిమాలు రూ. 100 కోట్లు సాధించిగా, ఇప్పుడు `సరిపోదా శనివారం` ఆ ఘనత సాధించింది.

నెట్ ఫ్లిక్స్ వేదికగా `సరిపోదా శనివారం` స్ట్రీమింగ్

ఇక థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న `సరిపోదా శనివారం` మూవీ త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడినా, ఫ్యాన్సీ అమౌంట్ చెల్లించి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెల(సెప్టెంబర్) 26 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

నాని, సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా

గతంలో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. అయితే, ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ, ఆయన వర్క్ తీరు నచ్చడంతో నాని మరో అవకాశం కల్పించారు. రెండో సినిమాతో సత్తా చాటారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత ఆమె మరోసారి నానితో జతకట్టింది.

`సరిపోదా శనివారం` సినిమాలో నాని, ఎస్ జే సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాని యాక్షన్ అవతార్ లో దుమ్మురేపారు. సూర్య తన పాత్రలో ఒదిగిపోయిన నటించారు. ఓవైపు ఉద్యోగిగా నేచురల్ గా ఉంటూనే మరోవైపు కోపంతో రగిలిపోయే యువకుడిగా నాని అద్భుతంగా ఆకట్టుకున్నారు. సూర్య ఇన్ స్పెక్టర్ దయానంద్ పాత్రలో అదరగొట్టేశారు. తనతోనే విలనిజాన్ని అద్భుతంగా ప్రదర్శించి వారెవ్వా అనిపించారు. ఈ సినిమాకు మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆయా సన్నివేశాలకు తగ్గట్లుగా ఎలివేషన్ ఇస్తూ బీజీఎం ఆకట్టుకుంది.  మొత్తంగా సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తికాక ముందే నాని సినిమా థియేటర్లలోకి రావడం విశేషం.

Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: బ్లాక్‌లో శ్రీవారి దర్శన టికెట్లు, పెద్దిరెడ్డి, రోజాకు రోజుకు రూ.కోటి ఆదాయం - టీడీపీ సంచలన ఆరోపణలు
బ్లాక్‌లో శ్రీవారి దర్శన టికెట్లు, పెద్దిరెడ్డి, రోజాకు రోజుకు రూ.కోటి ఆదాయం - టీడీపీ సంచలన ఆరోపణలు
Weather Latest Update: రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: బ్లాక్‌లో శ్రీవారి దర్శన టికెట్లు, పెద్దిరెడ్డి, రోజాకు రోజుకు రూ.కోటి ఆదాయం - టీడీపీ సంచలన ఆరోపణలు
బ్లాక్‌లో శ్రీవారి దర్శన టికెట్లు, పెద్దిరెడ్డి, రోజాకు రోజుకు రూ.కోటి ఆదాయం - టీడీపీ సంచలన ఆరోపణలు
Weather Latest Update: రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Bigg Boss 8 Telugu Elimination 3rd week: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
Pawan Kalyan Deeksha: భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Embed widget