Jayam Ravi: డివోర్స్, బెంగళూరు సింగర్‌తో రిలేషన్ మీద ‘జయం‘ రవి షాకింగ్ కామెంట్స్ - తెలుసు కానీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన హీరో
బెంగళూరు సింగర్ తో రిలేషన్ కారణంగా తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ వస్తున్న వార్తలపై నటుడు ‘జయం‘ రవి స్పందించారు. కావాలని కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jayam Ravi On Relationship With Singer: తమిళ నటుడు ‘జయం‘ రవి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే తనకు చెప్పకుండా వన్ సైడ్ గా రవి విడాకుల నిర్ణయం తీసుకున్నారని ఆయన భార్య ఆర్తి ఆరోపించగా... తాజాగా మరో కొత్త కథ తెర మీదకు వచ్చింది. ఓ సింగర్ తో ఉన్న రిలేషన్ కారణంగా ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరుకు చెందిన సింగర్ తో ఆయన కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి గోవా సహా పలు ప్రాంతాల్లో వెకేషన్ ఎంజాయ్ చేశారని ఓ తమిళ మ్యాగజైన వెల్లడించింది. ఈ ప్రచారంపై ‘జయం‘ రవి రియాక్ట్ అయ్యారు.
కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు- ‘జయం‘ రవి
సింగర్ తో రిలేషన్ కారణంగానే ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ‘జయం‘ రవి ఖండించారు. కొంతమంది కావాలనే ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “కావాలని కొంత మంది ఉద్దేశపూర్వకంగా నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ సింగర్ తో నాకు రిలేషన్ ఉందంటున్నారు. అవన్నీ అవాస్తవాలే. ఆమె నాకు తెలుసు. నేను ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఓపెన్ చేయాలి అనుకున్నాను. ఆమె శిక్షణ పొందిన మనస్తత్వవేత్త. డిప్రెషన్ లో ఉన్న చాలా మందిని ఆమె మామూలు మనుషులను చేసింది. ఆమెతో ఆధ్యాత్మిక కేంద్రం గురించి చర్చించాను తప్ప మరే సంబంధం లేదు” అని వెల్లడించారు.
#JayamRavi opens about linking up him with another singer (Which has been spread intentionally by one person):
— AmuthaBharathi (@CinemaWithAB) September 21, 2024
- Dragging names is not on. I know the person because I wanted to open a spiritual centre
- The person whose name is doing the rounds on the internet is a trained…
నా విడాకులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు- ‘జయం‘ రవి
అటు తాను ఏక పక్షంగా విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను ‘జయం‘ రవి ఖండించారు. “ నేను నా లాయర్ ద్వారా నోటీసు పంపాను. ఆర్తి తండ్రి ఆ నోటీసులను తీసుకున్నారు. ఈ విసయం గురించి మా తల్లిదండ్రులతో పాటు ఆర్తి తల్లిదండ్రులతోనూ డిస్కస్ చేశా. నేను ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎలా చెప్తారు? జూన్‌లో ఆరవ్ పుట్టిన రోజు జరిగింది. ఆ రోజు అందరం కలిసే అతడి బర్త్ డే నిర్వహించాం. బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఏకపక్షం అనే మాటకు అర్థం లేదు” అని చెప్పుకొచ్చారు.
నా వ్యక్తిత్వాన్ని తగ్గించలేరు- ‘జయం‘ రవి
ఇక తన విడాకుల గురించి చాలా మంది చాలా రకాలుగా స్పందించారని ‘జయం‘ రవి చెప్పారు. “విడాకుల గురించి ప్రకటించని తర్వాత కొంత మంది నన్ను సంప్రదించారు. అసలు విషయం ఏంటి? అని తెలుసుకున్నారు. నా గురించే చేసే ప్రయత్నాలు అన్నీ అసత్యాలు. కోర్టులో అన్ని విషయాలు బయటకు వస్తాయి. నిజం బయటపడిన రోజు నా మీద ఆరోపణలు చేసిన కొంత మంది ఫలితాన్ని అనుభవించేందుక సిద్ధంగా ఉండాలి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ను చెడగొట్టాలని ప్రయత్నించడం అంత సులభం కాదు” అని రవి వెల్లడించారు.
#JayamRavi:
— AmuthaBharathi (@CinemaWithAB) September 21, 2024
- There have been several talking points on my separation. Decent people have approached my issue with some dignity and indecent people have not maintained diplomacy in this💔
- However, coming to my business, I have proof and I am ready to prove anything in the court…
కొద్ది రోజుల క్రితం రవి, తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానులు షాక్ అయ్యారు. అటు రవి తనను అడగకుండానే విడాకుల ప్రకటన చేశాడని ఆర్తి చెప్పడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు సింగర్ వ్యవహారం బయటకు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది.
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే