అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘క’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్, నాగవంశీ వ్యాఖ్యలపై వివాదం - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘క’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ నుంచి నాగవంశీ వ్యాఖ్యలపై వివాదం వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా అక్టోబర్ 31వ తేదీన విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సమంత యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ రేపు విడుదల కానుంది. షణ్ముఖ్ జస్వంత్ ‘లీలా వినోదం’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రేమలో పడిన సంగతి ముందుగా నారా రోహిత్ పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పారట.

కిరణ్ అబ్బవరం ‘క’ రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘క’. త్వరలో ఈ మూవీ ప్రేక్షకులను అలరించబోతోంది. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎప్పుడో ఒకసారి కానీ మీడియా ముందుకు రారు. కానీ ఆయన వచ్చినప్పుడు మాట్లాడే మాటలు ఒక్కోసారి ముక్కు సూటిగా అనిపిస్తాయి. కొన్నిసార్లు వివాదాలకు కారణం అవుతాయి. అలానే ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నేరుగా ఓటీటీలోకి షణ్ముఖ్ జస్వంత్ ‘లీలా వినోదం’
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. టైటిల్ కొట్టేస్తాడు అనుకున్నా.. చివరి దశలో చేజార్చుకున్నాడు. బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు. కొంత కాలం పాటు సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్రేమలో పడిన సంగతి నారా రోహిత్ ముందు ఎవరికి చెప్పారో తెలుసా?
నారా రోహిత్ (Nara Rohith) ప్రేమ విషయం చాలా మందికి సర్‌ప్రైజ్ అని చెప్పాలి.‌‌ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట ప్రేమ వివాహం జరుగుతుందని, ఆయన సోదరుని కుమారుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడతారని ఎవరు ఊహించలేదు. 'ప్రతినిధి 2' సినిమాలో తనతో నటించిన సిరి అలియాస్ శిరీషతో నారా రోహిత్ ఏడు అడుగులు వేయడానికి ఆదివారం మొదటి అడుగు వేశారు. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రేమలో పడిన తర్వాత ఆయన ఈ విషయం ముందుగా ఎవరితో చెప్పారో తెలుసా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సమంత 'సిటాడెల్' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్...
కొన్నాళ్ల క్రితం సమంత చేసిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో సమంత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి అభిమానులను మెప్పించింది. తాజాగా రాజ్ అండ్ డీకే దర్శకుల ద్వయం సమంతలోని ఈ కొత్త టాలెంట్ ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరితో సమంతకు మంచి ఫ్రెండ్షిప్ సెట్ అయింది. అందుకే వారితో ఇప్పుడు 'సిటాడెల్ : హనీ బన్నీ' అనే సిరీస్ ను చేయడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన 'సిటాడెల్' అనే అమెరికన్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ ఈ 'సిటాడెల్ హనీ బన్నీ'. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈ సిరీస్ టీజర్ ను కొన్నాళ్ల క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టారు. ఇక తాజాగా 'సిటాడెల్ హనీ బన్నీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 15న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నాము అంటూ ఒక స్పెషల్ పోస్ట్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ మరికొన్ని గంటల్లోనే రాబోతుందనే విషయం తెలిసిన సమంత అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget