అన్వేషించండి

Leela Vinodam: నేరుగా ఓటీటీలోకి షణ్ముఖ్ జస్వంత్ ‘లీలా వినోదం’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Shanmukh Jaswanth : యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లీలా వినోదం’. త్వరలో ఈ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.

Leela Vinodam OTT Release Date: యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. టైటిల్ కొట్టేస్తాడు అనుకున్నా.. చివరి దశలో చేజార్చుకున్నాడు. బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు. కొంత కాలం పాటు సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.    

నేరుగా ఓటీటీలోకి ‘లీలా వినోదం’ మూవీ

షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ‘లీలా వినోదం’ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పవన్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ ముద్దుగుమ్మ అనఘా అజిత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఆర్ కృష్ణ చేత‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్  దాదాపు పూర్తి కావచ్చింది.  మరోవైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.   

ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్

తొలుత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా కొన్ని కారణాలతో నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ ఈ టీవీ విన్  వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. నవంబర్ 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో హీరో, హీరోయిన్లు సైకిల్ తొక్కుతూ ఒకరికొకరు తలకిందులుగా కనిపించారు. ఈ సినిమా విలేజ్ బ్యాగ్రౌండ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వినోద్ పాత్రలో షణ్ముఖ్ కనిపించనున్నారు. లీలాగా అనఘా అజిత్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన ప్రేమను అమ్మాయికి చెప్పాలి అనుకుని చెప్పలేని యువకుడి పాత్రలో ఆయన కనిపించాడు. త్వరలో  ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

డైరెక్టర్ భీమా శంక‌ర్ సినిమా చేస్తున్న షణ్ముఖ్

‘లీలా వినోదం’ సినిమాతో పాటు దర్శకుడు భీమా శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు షణ్ముఖ్ వెల్లడించాడు. వెండి తెరపై తనను తాను చూసుకోవాలనే కల, కోరిక నెరవేరుతుందని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు లభిస్తుందన్నాడు.  ఈ రెండు సినిమాలకు సైతం ప్రేక్షకులకు మంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.

Read Also: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో లక్ష్మీ ప్రస్తావన! చచ్చిపోతానంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో లక్ష్మీ ప్రస్తావన! చచ్చిపోతానంటోన్న యమున!
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bhogi Egilivaranga Song : ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget