Citadel Honey Bunny : సమంత 'సిటాడెల్' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్... మరికొన్ని గంటల్లో యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్
సమంత 'సిటాడెల్' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మరికొన్ని గంటల్లో ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ తెరపైకి రాబోతోంది.
ఇటీవల కాలంలో సమంత పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె నటించిన సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 'సిటాడెల్ హనీ బన్నీ' అనే ఈ సిరీస్ డేట్ ను ఫిక్స్ చేస్తూ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందో చూసేద్దాం పదండి.
మరికొన్ని గంటల్లో 'సిటాడెల్'ట్రైలర్...
కొన్నాళ్ల క్రితం సమంత చేసిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇందులో సమంత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి అభిమానులను మెప్పించింది. తాజాగా రాజ్ అండ్ డీకే దర్శకుల ద్వయం సమంతలోని ఈ కొత్త టాలెంట్ ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరితో సమంతకు మంచి ఫ్రెండ్షిప్ సెట్ అయింది. అందుకే వారితో ఇప్పుడు 'సిటాడెల్ : హనీ బన్నీ' అనే సిరీస్ ను చేయడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన 'సిటాడెల్' అనే అమెరికన్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ ఈ 'సిటాడెల్ హనీ బన్నీ'. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈ సిరీస్ టీజర్ ను కొన్నాళ్ల క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టారు. ఇక తాజాగా 'సిటాడెల్ హనీ బన్నీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 15న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నాము అంటూ ఒక స్పెషల్ పోస్ట్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ మరికొన్ని గంటల్లోనే రాబోతుందనే విషయం తెలిసిన సమంత అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సమంత వివాదాన్ని క్యాష్ చేసుకుంటున్నారా?
రీసెంట్ గా కొండా సురేఖ, సమంత గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమరాన్ని క్రియేట్ చేశాయి. దీంతో పలువురు ప్రముఖులు ఫైర్ అవుతూ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ నాగార్జున కోర్టుకు ఎక్కారు. ఈ విషయంపై నాగార్జున చట్టపరంగా పోరాడుతుండగా, కొండా సురేఖ పై ఇప్పటికే పరువు నష్టం దావా వేశారు. అయితే సురేఖ అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు కానీ సమంతను మాత్రం క్షమించమని సోషల్ మీడియా వేదికగా కోరింది. ఈ నేపథ్యంలోనే 'సిటాడెల్ హనీ బన్నీ' సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తుండడంతో ప్రస్తుతం సమంత వివాదం వల్ల వచ్చిన క్రేజ్ ను మేకర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సామ్ సురేఖ వివాదం తర్వాత రీసెంట్ గా 'జిగ్రా' ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది.