TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
తమిళనాడు, పుదుచ్చేరికి ఎన్నికల జరుగుతున్నందున మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన తమిళ వెట్రి కళగం TVK పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరిలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ రోడ్ షోలను ర్యాలీలను నిర్వహించారు. మండుటెండల్లో విజయ్ ఎన్నికల ప్రచారం చేస్తుండడాన్ని గమనించిన అభిమానులు దారిపొడవునా విజయ్ పై ప్రేమతో కూల్ డ్రింక్స్, కూలింగ్ గ్లాసెస్, కొబ్బరిబొండాలను అందిస్తూ విజయ్ పై తమ ప్రేమను చాటుకున్నారు. తనతో పాటు ప్రచారానికి సహకరిస్తూ కష్టపడుతున్న తన సిబ్బందికి కూడా విజయ్ కూల్ డ్రింక్స్ అందిస్తూ తమ ప్రేమను చాటుకుంటున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు తో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ పోటీ చేస్తోంది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ వీలైనంత వరకూ అభ్యర్థుల అందరి తరపునా ప్రచారాలకు హాజరు అవుతానని తమ పార్టీ నాయకులు మాట ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు





















