అన్వేషించండి

Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం

KCR camp office: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడులు చేశారు. తమ వెంట తెచ్చుకున్న రేవంత్ ఫోటోను ఆ కార్యాలయంలోపెట్టారు.

KCR camp office attacked in Gajwel: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శనివారం  జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తుముకుంట అంక్షా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి దూసుకెళ్లారు. కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంపై నిరసన తెలుపుతూ, వారితో తెచ్చుకున్న సీఎం ఫోటోను అక్కడ గోడకు తగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కార్యాలయ ఫర్నీచర్, కిటికీ అద్దాలు ధ్వంసం కావడంతో గజ్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా  మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్లు ఉన్నారు అని చేసిన వ్యాఖ్యలే ఈ అరాచకాలకు ప్రేరణ అని ఆమె మండిపడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి రౌడీ భాషలో మాట్లాడటం వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులు గూండా రాజ్యం నడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ఉండేదని, ఇప్పుడు అల్లకల్లోలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న హైడ్రా కూల్చివేతలు, భూముల సేకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గజ్వేల్ దాడి కేవలం ఒక కార్యాలయంపై జరిగిన దాడి కాదని, ఇది ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాజకీయాలు వద్దు అని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు.   

ఈ ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని, బీహార్ గ్యాంగ్‌లను తలపించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అనేది ప్రభుత్వ ఆస్తి అని, దాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గజ్వేల్ లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget