అన్వేషించండి

Ka Movie: ‘క’ రిలీజ్ డేట్ వచ్చేసింది, మలయాళంలో కిరణ్ అబ్బవరం మూవీకి క్రేజీ పోటీ

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

Ka Movie Release Date: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘క’. త్వరలో ఈ మూవీ ప్రేక్షకులను అలరించబోతోంది. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

అక్టోబర్ 31న అట్టహాసంగా ‘క’ సినిమా విడుదల

‘క’ సినిమాను దీపావళి కానుకగా ఈ నెల (అక్టోబర్) 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. గ్లింప్స్, టీజర్, సాంగ్ కూడా అలరించాయి. తాజాగా రిలీజ్ అయిన ‘మాస్ జాతర’ అనే పాట ప్రేక్షకులలో ఫుల్ జోష్ నింపింది. ‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..’  అంటూ సాగే ఈ పాట ఆహా అనిపించింది. కిరణ్ మాస్ స్టెప్పులు కుర్రాళ్లను ఉర్రూతలూగించాయి.  ఈ పాటకు సనాపాటి భరద్వాజ లిరిక్స్ రాయగా, సామ్ సీఎం మ్యూజిక్ అందించారు. పొలాకి విజయ్ క్రొరియోగ్రఫీ మెస్మరైజ్ చేసింది.

భారీ పీరియాడిక్ థ్రిల్లర్

‘క’ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్​లోనే భారీ పీరియాడిక్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

ఒకే రోజు ‘క’, ‘లక్కీ భాస్కర్’ విడుదల

‘క’ సినిమా మలయాళంలో క్రేజీ పోటీని ఎదుర్కోనుంది. మలయాళంలో ‘క‘ సినిమా రైట్స్​ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడెక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలీంస్ సొంతం చేసుకుంది. అయితే దుల్కర్​కు ఇది క్రేజీ కాంబో కానుంది. ఎందుకంటే ఆయన హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా.. మలయాళం థియేట్రికల్ రైట్స్ అందుకున్న ‘క’ సినిమా ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 31వ తేదీనే విడుదల కాబోతున్నాయి.

‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’ పేరుతో తెలుగులో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్యూట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీ వీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Read Also: 'అర్థమైందా అరుణ్‌ కుమార్‌' రెండో సీజన్ వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
Embed widget