రాజావారు రాణివారు సినిమాతో సాఫ్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం.

సినిమాల్లో ఎలా ఉన్నా.. బయట చాలా సైలెంట్​గా ఉంటూ.. సౌమ్యంగా కనిపిస్తాడు హీరో.

తాజాగా తన సొంతూర్లో జరిగిన జాతరకు వెళ్లి ఓ రేంజ్​లో ఎంజాయ్ చేశాడు.

సొంతూర్లో జరిగిన హనుమాన్ జాతరకు వెళ్లి.. అక్కడి విశేషాలను ఓ రీల్​లో షేర్ చేశాడు.

కానీ ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అదే కిరణ్ చేసిన మాస్ డ్యాన్స్ వీడియో.

డీజే సాంగ్స్​కు ఓ రేంజ్​లో మాస్ డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హీరోగా ఉన్నా సరే.. ఎలాంటి బేధం లేకుండా అందరితో కలిసి ఎంజాయ్ చేశాడంటూ తెగ పొగిడేస్తున్నారు.

మాములుగా కిరణ్ అబ్బవరంపై ఎక్కువ ట్రోల్స్ వస్తుంటాయి. వాటిని హీరో కూడా స్పోరిటివ్​గా తీసుకుంటాడు.

ఇప్పుడు మాత్రం అభిమానులు, నెటిజన్లు ఆయన సింప్లిసిటీని తెగ మెచ్చేసుకుంటున్నారు.

కిరణ్ అబ్బవరం 2023లో రూల్స్ రంజన్​తో వచ్చాడు. ప్రస్తుతం వేరే సినిమాల్లో ఆయన కనిపించలేదు.

రాజావారు రాణివారు హీరోయిన్​నే ప్రేమించి.. ఎంగేజ్​మెంట్​ చేసుకున్నాడు. (Images Source : Instagaram/kiran abbavaram)