
Entertainment Top Stories Today: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ అప్‌డేట్, సంక్రాంతికి వస్తున్నాం అంటున్న వెంకీ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ అప్‌డేట్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం అంటున్న వెంకీ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ టీజర్ అప్‌డేట్ వచ్చింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతికి వస్తుందని వెంకటేష్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవలే రివ్యూ రైటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక నటుడు ఆ ఫంక్షన్‌కు తాగి వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున వరస్ట్ అని స్పై అక్క సీరియస్ అయ్యారు. బాలకృష్ణ సినిమా టైటిల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీపావళికి రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టీజర్...
రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer Movie). తెలుగుతో పాటు ఈ సినిమాను తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. అంత కంటే ముందు సినిమా ఎలా ఉండబోతుందో అనేది ప్రేక్షకులకు చెప్పడానికి చిన్న టీజర్ రెడీ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంక్రాంతికి వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా...
సంక్రాంతి బరి నుంచి విక్టరీ వెంకటేష్ వెనక్కి తగ్గలేదు. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఖరారు చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది అనౌన్స్ చేయక ముందే... సంక్రాంతికి అసలు ఆ సినిమా వస్తుందా? లేదా? అనే సందేహాలు మొదలు అయ్యాయి. వాటికి ఈరోజు సినిమా యూనిట్ చెక్ పెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు...
ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. ఆ అభిప్రాయం ఇతరులను కించపరిచే విధంగా లేనంత వరకు ఎటువంటి సమస్య ఉండదు. తమ హద్దు దాటి... మితిమీరిన భాష, బూతులు ఉపయోగిస్తే సభ్య సమాజంలో ఆమోదయోగ్యంగా ఉండదు. ఎంతో ప్రేమతో ప్రతి ఒక్కరూ సినిమా తీస్తారు. అయితే ఆ సినిమా అందరినీ మెప్పిస్తుందని చెప్పలేం. విమర్శకులకు కొందరు తమకు నచ్చని సినిమాల పట్ల నచ్చలేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన ఓ సినిమా విమర్శకులు కొంత మందికి నచ్చలేదు. అయితే ఆ సినిమాల్లో నటించిన నటుడు రివ్యూ రైటర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని ఇండస్ట్రీ గుసగుస. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్
కథానాయకుడిగా అక్కినేని నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు యాక్షన్ సినిమాలు చేస్తారు. మరొక వైపు ఇతర భాషల్లో స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు కూడా చేస్తారు. ఇంకో వైపు బుల్లితెర మీద హోస్ట్ పాత్రలో తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు. అయితే... బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu) రియాల్టీ షోను నాగార్జున హోస్ట్ చేస్తున్న తీరు పట్ల కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాలకృష్ణ సినిమా టైటిల్ అది కాదు...
బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'డాకు మహారాజ్' టైటిల్ ఖరారు చేశారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది నిజం కాదని సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

