Game Changer Teaser: దీపావళికి రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టీజర్... అఫీషియల్‌గా అనౌన్స్ చేశారోచ్
Game Changer Teaser Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'గేమ్ చేంజర్'. ఆ మూవీ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఓ క్షణం ఈ దీపావళికి రానుంది. మెగా అభిమానులు అందరికీ 'గేమ్ చేంజర్' యూనిట్ ఓ గిఫ్ట్ రెడీ చేసింది. అది ఏమిటంటే....
దీపావళికి గేమ్ చేంజర్ టీజర్ విడుదల
Game Changer Teaser Release Date: రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer Movie). తెలుగుతో పాటు ఈ సినిమాను తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. అంత కంటే ముందు సినిమా ఎలా ఉండబోతుందో అనేది ప్రేక్షకులకు చెప్పడానికి చిన్న టీజర్ రెడీ చేశారు.
దీపావళి పండక్కి 'గేమ్ చేంజర్' టీజర్ విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ రోజు ట్వీట్ చేసింది. అంటే దీపావళికి అని డైరెక్టుగా చెప్పలేదు. త్వరలో ఫైర్ వర్క్స్ మొదలు అవుతాయని పేర్కొంది. టపాసులు పేలేది దీపావళికే కదా! అలా క్లారిటీ ఇచ్చారు అన్నమాట. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలపై 'దిల్' రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: నాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్ - ముందు ఆయన్ను మార్చేయాలి... స్పై అక్క సీరియస్
Here it is!!
— Team RamCharan (@AlwayzRamCharan) October 27, 2024
Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥
The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/nHU4IILjh6
'గేమ్ చేంజర్'కు పోటీ తప్పదా? సంక్రాంతి బరిలో!
Sankranthi 2025 Releases: 'గేమ్ చేంజర్' కోసం మెగాస్టార్ చిరంజీవి తన సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర' విడుదలను వాయిదా వేశారు. అయితే... 'దిల్' రాజు సంస్థ నుంచి వస్తున్న మరొక సినిమా మాత్రం ఇంకా వాయిదా పడలేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా (సంక్రాంతికి వస్తున్నాం)ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మరోసారి చిత్ర బృందం పేర్కొంది. దాంతో రామ్ చరణ్ సినిమాకు సోలో రిలీజ్ దొరకడం కష్టం అని ఆల్రెడీ కామెంట్లు వినబడుతున్నాయి.
సంక్రాంతి బరిలో 'గేమ్ చేంజర్'తో పాటు వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం', నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు (NBK 109 Movie) ఉన్నాయి. వీటికి తోడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 'గుడ్ బాడ్ అగ్లీ' కూడా ఉంది. సందీప్ కిషన్ హీరోగా త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ చేస్తున్న 'మజాకా' కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి.
Also Read: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
'గేమ్ చేంజర్' విషయానికి వస్తే... ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు తెలుగు అమ్మాయి అంజలి కనిపించనున్నారు. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర వంటి హీరోలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'జరగండి జరగండి', 'రా మచ్చా' సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.