Nagarjuna: నాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్ - ముందు ఆయన్ను మార్చేయాలి... స్పై అక్క సీరియస్
కింగ్ అక్కినేని నాగార్జున మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఆయన కంటే ఎన్టీఆర్ నాని బెటర్ అని ముందు ఆయనను మార్చేయాలని కామెంట్లు చేస్తున్నారు అసలు ఎందుకీ విమర్శలు అనేది ఆలోచిస్తే...

కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అజాత శత్రువు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అందరికీ సన్నిహితుడు. ఎవరితోనూ ఎటువంటి వివాదాలు పెట్టుకోరు. వివాదాస్పద అంశాల జోలికి కూడా వెళ్లరు. ఆ హీరో మీద ఇటీవల వరుస వివాదాలు వస్తున్నాయి. రాజకీయ పరంగా మాత్రమే కాదు... రియాలిటీ షో విషయంలోనూ ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఫ్రీగా చేస్తున్నారా... సగం సగం చూసి రావడం ఏమిటి?
కథానాయకుడిగా అక్కినేని నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు యాక్షన్ సినిమాలు చేస్తారు. మరొక వైపు ఇతర భాషల్లో స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు కూడా చేస్తారు. ఇంకో వైపు బుల్లితెర మీద హోస్ట్ పాత్రలో తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు. అయితే... బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu) రియాల్టీ షోను నాగార్జున హోస్ట్ చేస్తున్న తీరు పట్ల కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున మీద బిగ్ బాస్ వీక్షకులు చేస్తున్న విమర్శలలో ప్రధానమైనది ఆయన బిగ్ బాస్ ఎపిసోడ్స్ అసలు పూర్తిగా చూడడం లేదు అని! ''ఏదో ఫ్రీగా హోస్టింగ్ చేస్తున్నట్లు సగం ఎపిసోడ్స్ చూసి వచ్చేస్తారు. వీక్ అంతా కష్టపడిన వాళ్లకు అప్రిసియేషన్ ఉండదు'' అని బిగ్ బాస్ షో చేస్తున్న నాగార్జునపై బిగ్ బాస్ స్పై అక్క (Bigg Boss Spy Akka) సోషల్ మీడియాలో తన అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇంకా నాగార్జునను మార్చేయడం బెటర్!
బిగ్ బాస్ రియాల్టీ షో హోస్ట్ కింద ఇక నాగార్జునను మార్చేయడం బెటర్ అని బిగ్ బాస్ స్పై అక్క అభిప్రాయ పడింది. ''బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న లిస్టు అన్ని భాషల నుంచి తీస్తే నాగార్జున గారు ఆ ర్యాంకింగ్స్ విషయంలో చివరి స్థానంలో ఉంటారు. ఆయన కంటే ఎన్టీఆర్, నాని బెటర్ అని స్పై అక్క కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఆవిడ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఈ వారం అంతా షోలో టేస్టీ తేజ (Tasty Teja) అద్భుతమైన గేమ్ ఆడితే అతడని కనీసం అప్రిషియేట్ చేయలేదని, ఎపిసోడ్స్ పూర్తిగా చూడకుండా హోస్ట్ చేయడానికి నాగార్జున రావడం కారణమని ఆవిడ ఆరోపించింది.
Em Sir meeru Tasty Teja ni appreciate cheyyara?? Why ?? Biased Bigg Boss 🙏🙏 #BiggBossTelugu8
— BiggBossTeluguSpy (@bbteluguspy) October 26, 2024
Also Read: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
బిగ్ బాస్ షో పరంగా ఈ విధమైన విమర్శలు వస్తుంటే... ఆ మధ్య తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీ ప్రతిష్టను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆవిడ చేసిన వ్యాఖ్యల పట్ల నాగార్జున కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే... సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి సినిమాలో నాగార్జున ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు.
Also Read: సంక్రాంతికి వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా... గేమ్ చేంజర్ కోసం వాయిదా వేయట్లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

