Ennenno Janmalabandham October 20th: మాళవిక ఉచ్చులో చిక్కుకున్న యష్- ఆదిని ఎరగా వేసి ఆడుకుంటున్న మాజీ పెళ్ళాం
మాళవిక యాక్సిడెంట్ చేసిందనే విషయం యష్ వేద దగ్గర దాస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఏంటి ఇలా జరుగుతుంది ఒకవైపు వేద మరోవైపు మాళవిక టెన్షన్ పెరిగిపోతుంది. మాళవిక యాక్సిడెంట్ చేసింది వేదకి చెప్తే.. ఈ గండం గడిచేది ఎలా ఆదిత్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఎలా అని యష్ మనసులోని బాధపడతాడు. వేద వచ్చి ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. ఏమి లేదని కవర్ చేస్తాడు యష్. కానీ వేద మాత్రం నమ్మదు, ఆఫీసులో వర్క్ కొంచెం ఎక్కువ అయింది అంతకమించి ఏమి లేదని చెప్పేందుకు చూస్తాడు. ఇది వర్క్ టెన్షన్ లా అనిపిస్తుంది ఏంటది, నాకు కూడా చెప్పరా అని వేద అడుగుతుంది.
యష్ వెంటనే వెళ్ళి వేద చేతులు పట్టుకుని ఒకటి చెప్పాలి నీకు. నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆ రోజు పార్టీలో ఈ జన్మకి నేను ఇద్దరు బిడ్డల తండ్రి అన్నాను, ఆ మాట వల్ల నువ్వు బాధపడ్డావ్. నా ఉద్దేశం నిన్ను తక్కువ చేయాలని కాదు. నా ఖుషికి నువ్వే అమ్మవి. నా బిడ్డకి తల్లి లేని లోటు తీర్చి తల్లి ప్రేమ పంచావ్. ఖుషికి తల్లి అవడం కోసమే నాకు భార్య అయ్యావు. మర్చిపోతానా నేను.. జన్మజన్మలకి నువ్వు చేసిన ఉపకారం మర్చిపోను. ఈ జన్మకి నా భార్య స్థానం, ఖుషికి అమ్మ స్థానం నీదే. నువ్వు తల్లి కాలేవని నన్ను తండ్రిని చేయలేవని నాకు ఎలాంటి కొరత లేదు. మన ఇద్దరికీ ఖుషినే ప్రాణం. నా వల్ల నువ్వు బాధపడితే నన్ను క్షమించి అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
Also read: నీ తప్పులు అయిపోయాయ్ క్షమించేదే లేదన్న తులసి- సామ్రాట్ ని ఏకిపారేసిన లాస్య
నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు, మీ మాటలకి నేను ఫీల్ అయ్యాను నాకోసం ఇంత ఫీల్ అవుతున్నారా, చాలు ఏ భార్య అయిన తన భర్త నుంచి ఏం కోరుకుంటుంది. నా గురించి మీరు ఆలోచించినట్టే నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. నాకు అర్థం అయ్యింది మీరు పడే టెన్షన్ వెనుక అసలు కారణం ఎంతో తెలిసిపోయింది. అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాడు చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయాడు అదే కదా మీ బాధ. అమ్మ మీ గురించి ఎంత బాగా చెప్పిందో విన్నారా.. మీ వల్ల మాకు చాలా మేలు జరిగింది. మీ మీద మీ కన్నా మాకే ఎక్కువ నమ్మకం ఉంది. ఇప్పుడు మా అందరి దృష్టిలో యశోధర్ అంతే ఒక భరోసా, ఒక నమ్మకం మీరు ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడకండి. మీరు ఏం చేసిన కరెక్ట్ చేస్తారని గుడ్డి నమ్మకం. ఈ రోజు మా ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే అది మీ వల్లే’ అని వేద అంటుంది.
వేద తన మీద పెట్టుకున్న నమ్మకం చూసి యష్ కుమిలిపోతాడు. ఖైలాష్ వచ్చి యశోధర్ వచ్చాడంట కదా అని మాళవికని అడుగుతాడు. వాళ్ళ అత్తగారికి నేనే యాక్సిడెంట్ చేసింది నేనే అని తెగ అనుమానపడిపోతున్నారని అంటాడు. అదంతా మేనేజ్ చేసినట్టు చెప్తుంది. నిజమా నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకంటే ఆ యశోధర్ వెనుక వేద ఉందని ఖైలాష్ చెప్తాడు. వేద ఉంటే ఏంటి ఎవరు ఆ వేద అని మాళవిక సీరియస్ అవుతుంది. తనని తక్కువ అంచనా వెయ్యకండి చేతులు జోడించి బటిమలదాడటం తెలుసు పిడికిలి బిగించడం కూడా తెలుసు అని ఖైలాష్ హెచ్చరిస్తాడు. దాని ఆటలు ఎవరు దగ్గర అయినా సాగుతాయేమో కానీ నా దగ్గర కాదు ఆ వేదలో లేనిది నాలో ఉన్నది జానతనం. మొగుడ్ని లొంగదీసుకునే జానతనం, పులిలా వచ్చాడు పిల్లిలా వెళ్ళాడు. ఆ వేద యశోధర్ బలం అయితే ఆది బలహీనత. అదే కొట్టి నేను అనుకున్నది సాధించాను అని మాళవిక చెప్తుంది.
Also read: మళ్ళీ కనిపించకుండా పోయిన దేవి- బిడ్డని ఆదిత్యకి ఇవ్వనన్న రుక్మిణి
ఎక్స్ పోజ్డ్ గ్రీష్మ కారు రోడ్డు మీద ఆగిపోవడంతో వేద అటుగా వస్తుంది. తనని చూసి వెళ్ళి పలకరించి తన కారులో తీసుకెళ్తుంది. ఖుషి వేద మాట్లాడుకుంటూ ఉంటారు. స్కూల్ లో ఒక కథ చెప్పారు అని యష్ చేసిన దాని గురించి కథలాగా చెప్తుంది. హీరో హీరోయిన్ దగ్గర ఒక విషయం దాస్తాడు. హీరోయిన్ దగ్గర విషయం దాచడం తప్పు కదా అని ఖుషి అంటుంటే యష్ అదంతా వింటూ టెన్షన్ పడతాడు. హీరో వెరీ బ్యాడ్ కదా అని అడుగుతుంది. ఆ మాటకి యష్ కోపంగా ఖుషి అని అరుస్తాడు.