News
News
వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham May 9th: చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్- మాళవిక పెళ్లికి అందరినీ ఒప్పించిన వేద

యష్, వేద ఒకరిమీద ఒకరు ప్రేమ చెప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

మాళవిక యష్ ఇంటికి వచ్చేసరికి మాలిని తనని తిడుతుంది. అసలు ఎందుకు వచ్చావు ఎవరు రమ్మన్నారని అరుస్తుంది. తను ఏదో చెప్పాలనుకుంటుంది చెప్పనివ్వమని వేద అంటుంది. చెప్పడానికి ఏమి లేదు వెళ్లిపొమ్మని యష్, మాలిని అంటారు. అప్పుడే వసంత్ వస్తాడు. నేనే తీసుకొచ్చాను మా పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు కదా అక్క కూడా ఉంటే బాగుంటుందని తీసుకొచ్చానని చెప్తాడు. తను మంచి పని కోసమే వచ్చిందని వేద చెప్తుంది. తను ఇక్కడే ఉంటే గొడవలు జరుగుతాయి వెళ్లిపొమ్మని చెప్పమని మాలిని అంటే ఏం గొడవ చేయను వెళ్లిపొమ్మని చెప్పొద్దు నాకు ఉంది వీడు ఒక్కడే తమ్ముడు నేను కాకుండా వీడి మంచీ చెడు ఎవరు చూస్తారని జాలిగా అడుగుతుంది. వసంత్ లైఫ్ లో జరిగే మంచి శుభకార్యం ఇది అక్క పక్కన ఉండాలని అనుకోవడంలో తప్పేమీ లేదని వేద కూడా సపోర్ట్ చేస్తుంది. మాలిని వాళ్ళు అయిష్టంగా వెళ్లిపోతారు.

యష్ కూడా కోపంగా లోపలికి వచ్చేస్తే వేద వచ్చి సర్ది చెప్తుంది. చిత్ర అందంగా ముస్తాబవుతుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే చిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమైంది కళ్ళలో నీళ్ళు ఎందుకు పిన్నీ అంటుంది. అన్నింటికన్నా మీరు నా మీద చూపిస్తున్న అంతులేని ప్రేమ మోస్ట్ బ్యూటీఫుల్ ఎప్పటికీ మర్చిపోలేను. సొంత కూతుర్ని కాకపోయినా నా కోసం ఇంత చేస్తున్నారని బాధపడుతుంది. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి బిడ్డవేనని సులోచన చెప్తుంది. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటే ఈ కన్నీళ్ళు ఎందుకు రేపటి నుంచి పెళ్లి పనులు మొదలవుతాయి వసంత్ ని హ్యపీగా ఉంచాలని వేద కూడా చెప్తుంది. పంతుల్ని పిలిపిస్తారు. 20వ తారీఖున మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తే దాన్ని ఖాయం చేయమని మాలిని అంటుంది.

ALso Read: అత్తాకోడళ్లకు చీవాట్లు పెట్టిన గోవిందరాజులు- జానకి చేతికి చిక్కిన కీలక ఆయుధం, ఇక మనోహర్ కి చుక్కలే

కుటుంబం అంతా వసంత్, చిత్రకి కంగ్రాట్స్ చెప్తారు. ఇద్దరూ ఒకరికొకరు స్వీట్ తినిపించుకోమని ఖుషి చెప్తుంది. దీంతో ఇద్దరూ ప్రేమగా తినిపించుకుంటారు. నేను అభి కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ఏదో ఒక కారణంతో పోస్ట్ పోన్ అవుతుంది. వసంత్ పెళ్లికి ముహూర్తం పెట్టారు కదా అదే రోజు మేము కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నామని మాళవిక చెప్తుంది. ఈ పెళ్లికి ఒప్పుకోనని మాలిని, సులోచన అంటారు. ఎవరి ముహూర్తాలు వాళ్ళు పెట్టుకుంటే మంచిదని చెప్తారు. యష్ కూడా అవసరం లేదు అసలు ఈ ఆలోచన ఎవరిది? ఎవరైన చెప్పమని చెప్పారా? ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలని లేదా ఈ ఆలోచన అసలు వద్దు. వాళ్ళ పెళ్లికి మీ పెళ్లికి ముడి పెట్టుకోవద్దని చెప్తాడు. ఇందులో తప్పేముంది అక్క పెళ్లి జరగకుండా తమ్ముడి పెళ్లి జరగకూడదని అంటారు ఒకేసారి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏంటని నిలదీస్తుంది.

Also Read: లాస్యకి విడాకులు ఇస్తానన్న నందు- దివ్య మీద ఫైర్ అయిన విక్రమ్

వసంత్ పెళ్లికి మాళవిక ఉండాలి కదా మరి అలాంటిది పెళ్లి పీటల మీద ఉంటే తప్పు ఏంటని వేద అంటుంది. ఈ పెళ్లి నా జీవితం కోసమే కాదు మన కొడుకు కోసం కూడ. మా పెళ్లి జరిగితే వాడి లైఫ్ సెటిల్ అవుతుంది వాడి జీవితానికి ఏ లోటు ఉండదని అడుగుతుంది. కానీ యష్ మాత్రం రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగడానికి వీల్లేదని చెప్తాడు. మళ్ళీ ఏం పిచ్చి ప్లాన్ వేస్తున్నావని మాలిని ససేమిరా అంటుంది. వేద యష్ ని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఈ పెళ్లి జరిగితే మాళవిక వెళ్ళిపోతుంది అప్పుడు చిత్ర, వసంత్  హ్యపీగా ఉంటారు. బాబు లైఫ్ కూడా బాగుంటుందని వేద సర్ది చెప్పడంతో యష్ అంగీకరిస్తాడు. మాలిని వాళ్ళని కూడ అర్థం చేసుకోమని చెప్పి అందరినీ ఒప్పిస్తుంది. నీ పెళ్లికి అందరినీ ఒప్పించాను తర్వాత ఏ తలంపు రాకూడదని వేద అంటే ఏ తలవంపు రాకుండా చూస్తానని మాళవిక మాట ఇస్తుంది.

Published at : 09 May 2023 02:59 PM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial May 9th Episode

సంబంధిత కథనాలు

Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య

Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

The Kerala Story: కమల్‌ హాసన్‌ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్

The Kerala Story: కమల్‌ హాసన్‌ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్

Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

Krishna Mukunda Murari May 29th: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ

Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?

Guppedanta Manasu May 29th: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Value Buys: మార్కెట్‌ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్‌' మీ దగ్గర ఉన్నాయా?

Value Buys: మార్కెట్‌ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్‌' మీ దగ్గర ఉన్నాయా?