By: ABP Desam | Updated at : 11 May 2023 07:34 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
యష్ వేదకి దగ్గరవడం కోసం అవి కూడా తెచ్చి తనకి కనిపించేలా పెడతాడు. తనని కూడా చీర కట్టుకుని రమ్మని చెప్పి ఏ చీర కూడా కట్టుకోవాలో సెలెక్ట్ చేస్తాడు. కొంపదీసి అది ఈయనే తీసుకురాలేదు కదా ఈయన అయి ఉండరులే అనుకుంటుంది. మీరు నాకు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా అని వేద అడుగుతుంది. ఇంతకు తను వాటిని చూసిందా లేదా అని కబోర్డ్ తీసి వెతుకుతాడు. అవి లేవని గమనించి యష్ నవ్వుకుంటాడు. ఏంటి వెతుకుతున్నారని వేద అడుగుతుంది. తన వస్తువు ఒకటి కనిపించడం లేదని వెతుకుతుంటే అది కనిపిస్తుంది. ఏదో చెప్పాలని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు ఏంటో చెప్పమని అడుగుతుంది. మనం ముహూర్తం అనుకున్నాం కదా అని నసుగుతుంటే అంటే అది తీసుకొచ్చింది ఈయనే పర్లేదు బాగానే డెవలప్ అయ్యారే అనుకుని యష్ ని ఆడుకోవాలని డిసైడ్ అవుతుంది. ఏ ముహూర్తం పెళ్లి ముహూర్తమా అది అయిపోయింది కదా ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది.
Also Read: విక్రమ్ రూడ్ బిహేవియర్ - రాజ్యలక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన దివ్య
తనకి అర్థం అయ్యేలా చెప్పడం ఇక నా వల్ల కాదని ఏం లేదులే అని ముసుగు తన్నేసి తిట్టుకుంటూ పడుకుంటాడు. అది చూసి వేద నవ్వుకుంటుంది. నాకు అర్థం అయ్యింది మనం ఇద్దరం ఒక్కటైతే ప్రేమ పెరుగుతుందని అనుకుంటున్నారు. మన భార్యాభర్తల బంధం కూడా బలపడుతుంది. ఆ రోజు దగ్గర్లోనే ఉందని యష్ కి నుదుటి మీద ముద్దు పెడుతుంది. చిత్ర ఆఫీసులో అందరికీ స్వీట్స్ పంచి పెడుతూ పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెప్తుంది. అభి దగ్గరకి వచ్చి పెళ్లి ఫిక్స్ అయ్యిందని స్వీట్ తీసుకోమని చెప్తుంది. మనకి పెళ్లి ఫిక్స్ అయ్యిందని నాకే స్వీట్ తీసుకొచ్చి ఇస్తున్నవా అనేసరికి చిత్ర షాక్ అవుతుంది.
అభి: మన పెళ్లికి అంటే నీకు నాకు కాదు బేబీ మన రెండు జంటలకు ఫిక్స్ అయ్యిందని చెప్తున్నా. రెండు జంటలకు ఒకేసారి ఒకే ముహూర్తంకి పెళ్లి ఎందుకు ఫిక్స్ అయ్యిందో తెలుసా? మనం ఇద్దరం కలవడానికే
చిత్ర: నాకు వసంత్ కి పెళ్లి ఫిక్స్ అయ్యింది
అభి: మనం ఇద్దరం కలిసి లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటే నువ్వేంటి వసంత్ తో పెళ్లి అంటావ్. నాకు నీ పిచ్చి పట్టింది రెండు పెళ్లిళ్లకు ఒకటే ముహూర్తం అనుకుంటున్నావా కానీ ఒకటే పెళ్లి జరుగుతుంది అది మన పెళ్లి ఆ ముహూర్తానికి నేను నీ మెడలో తాళి కట్టబోతున్న
చిత్ర: నీకు నాకు పెళ్లి ఏంటి
అభి: జరగబోయేది మన పెళ్లి. నువ్వు డిసైడ్ అయిపో నువ్వు నాకే సొంతం అంటుండగా మాళవిక వస్తుంది. తను రాగానే మాళవిక వైపు మాట్లాడుతూ ప్లేట్ ఫిరాయిస్తాడు. మళ్ళీ తను వెళ్లిపోయాక మనం పెళ్లి చేసుకోబోతున్నాం, వసంత్ తో పెళ్లి అని పిచ్చి వేషాలు వేయకని వార్నింగ్ ఇస్తాడు.
Also Read: ట్విస్ట్ అదుర్స్, కావ్యని తోసేసి పారిపోయిన స్వప్న- రాహుల్ చెంప పగలగొట్టిన రాజ్
వదిలేసి వెళ్ళిపోయిన పెళ్ళాంకి నాచేతులతోనే పెళ్లి జరిపిస్తున్నావని యష్ చిరాకు పడతాడు. పెళ్లి ఏర్పాట్లు మొదలైపోతాయి. నీతో ఏడడుగులు నడిచే క్షణం కోసం ఎంతగా ఎదురుచూశానోనని వసంత్ చిత్రని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మాళవిక వాళ్ళు వస్తారు. అభి రావడం చూసి చిత్ర మొహం మాడిపోతుంది.
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!