By: ABP Desam | Updated at : 02 Dec 2022 07:40 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
వేద యష్ ని ఇంటికి తీసుకొచ్చి చేతికి తగిలిన దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అప్పుడే మాళవిక యష్ కి ఫోన్ చేస్తుంది. అది చూసి వేద కోపంగా వెళ్ళిపోతుంది. ఖుషి బాధగా కూర్చుని ఉంటుంది. చిత్ర వచ్చి ఏమైందని అడుగుతుంది. అమ్మకి డాడీ మీద కోపం వచ్చిందని చెప్పి ఫీల్ అవుతుంది. మమ్మీ డాడీ మధ్య డిష్యుం డిష్యుం జరుగుతుందని చెప్తుంది. వాళ్ళని కలిపేందుకు ఏదైనా ఐడియా ఇవ్వమని చిత్రని అడుగుతుంది. మేం ముగ్గురం హ్యపీగా ఎంజాయ్ చెయ్యాలని అంటుంది. మీ మమ్మీ డాడీకి ప్రైవసీ దొరకడం లేదు వాళ్ళని మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళి పార్టీ ఇస్తే వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారని ఐడియా ఇస్తుంది. సరే అయితే వాళ్ళని తీసుకుని వెళ్తాను అని ఖుషి హ్యాపీగా ఉంటుంది.
మాళవిక యష్ తో మాట్లాడుతుంది. మమ్మీ నువ్వు జైలుకి వెళ్తే నేను చచ్చిపోతాను అని భయపడుతూ ఏడుస్తున్నాడని మాళవిక యష్ తో చెప్తుంది. ఆ మాటకి యష్ తప్పంతా నాదే అని ఫీల్ అవుతాడు. వీడిని నమ్ముకుంటే పని అవదు అని అభిమన్యు అనేసరికి యష్ కోపంగా అసలు ఇదంతా నీవల్లే వచ్చిందని తన మీదకి దూకుతాడు. మాళవిక వాళ్ళిద్దరినీ ఆపి అభిమన్యుని తిడుతుంది. ‘నా భర్త, మా కుటుంబం ఇది మా సమస్య నువ్వు బయట వ్యక్తివి బయటకి పో’ అని అభి మీద మాళవిక అరుస్తుంది. ఈ యాక్సిడెంట్ చేసింది ఆదిత్య అనే విషయం ఈ అభిమన్యుకి అసలు తెలియకూడదు తెలిస్తే చాలా ప్రమాదం అని యష్ మాళవికతో అనడం చాటుగా అభి వినేస్తాడు.
Also Read: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్
యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు నీ కొడుకు అని నా దగ్గరే దాస్తావా, కొడుకు సెంటిమెంట్ తో యశోధర్ ని లొంగదీసుకుందామని ట్రై చేస్తున్నవా. అసలు గేమ్ నేను స్టార్ట్ చేసి మిమ్మల్ని ఫినిష్ చేస్తాను అని అభి ఏదో ప్లాన్ వేస్తాడు. అమ్మానాన్న కటీఫ్ లో ఉన్నారు వాళ్ళని కలపాలంటే డిన్నర్ పార్టీకి వెళ్ళాలి హెల్ప్ చెయ్యమని మాలిని వాళ్ళని ఖుషి అడుగుతుంది. అప్పుడే యష్ వస్తాడు. తను రాగానే అమ్మ, నువ్వు నేను డిన్నర్ పార్టీకి వెళ్దాంఅని అడుగుతుంది. ఇప్పుడు కాదు తర్వాత వెళ్దామని యష్ అంటే కాదు ఇప్పుడే వెళ్ళాలి అని ఖుషి మారాం చేస్తుంది. దీంతో యష్ కోపంగా ఖుషి మీద అరుస్తాడు. భయపడిపోయిన ఖుషి వెంటనే ఎదురుతిరిగి మాట్లాడుతుంది. ఇప్పుడు పార్టీకి వెళ్లకపోతే ఎవరితో మాట్లాడను బ్యాడ్ గర్ల్ గా మారిపోతాను అన్నం తినను అని చెప్పి వెళ్ళి అలిగి కూర్చుంటుంది.
యష్ వచ్చి ఖుషిని పలకరిస్తాడు కానీ తను మాత్రం మాట్లాడను అని మారాం చేస్తుంది. మీ నాన్నకి నీకన్నా ఎక్కువ పనులు ఉంటాయ్ మారాం చెయ్యకు అని వేద కోపంగా అంటుంది. వేద ఎంత చెప్పడానికి చూసినా కూడా ఖుషి తన మాట వినదు. మాలిని యష్ కి నచ్చజెప్పి ఖుషి అలిగింది బయటకి తీసుకెళ్లు అని ఆర్డర్ వేస్తుంది. సరే అని యష్ అనేసరికి ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజం తెలిసినందుకు అభిమన్యు ఫుల్ ఖుషీగా ఉంటాడు. ఆటం బాంబ్ లాంటి ఈ బ్రేకింగ్ న్యూస్ వేదకి చెప్తే ఆ ఆదిత్యని బొక్కలో వేయిస్తుంది, మాళవిక మీద పగ తీర్చుకోవడానికి తనకి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అని అభి అనుకుంటాడు.
Also Read: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్
వేద, ఖుషి, యష్ రెస్టారెంట్ కి వెళతారు. కానీ వాళ్ళిద్దరూ మొహాలు పక్కకి పెట్టుకుని కూర్చుంటారు. అది చూసి ఖుషి వెళ్లిపోదాం పదండి మీరిద్దరూ సీరియస్ గా మాట్లాడుకోకుండా ఉంటే ఏం ప్రయోజనం అని అంటుంది. వాళ్ళని నవ్వించడానికి ఖుషి ట్రై చేస్తుంది.
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?
Janaki Kalaganaledu January 30th: తోపుడు బండి మీద వ్యాపారం మొదలుపెట్టిన రామా- అవమానించిన కన్నబాబు, బుద్ధి చెప్పిన జానకి
Adhire Abhi Comments: మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి, ‘జబర్దస్త్’పై అదిరే అభి కామెంట్స్!
Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్కు విజయశాంతి కౌంటర్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే